Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతుల ఉద్యమం: అత్యంత హింసాత్మక ఘటనలుగా నిలిచినా ఎర్రకోట హింసాకాండ, లఖింపూర్ ఖేరీ ఘటన

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు సాగించిన పోరాటంలో అనేక విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం కోసం రైతును సాగించిన పోరాటంలో, ఏడాదిపాటు సాగిన ఉద్యమంలో అత్యంత విషాదకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఉద్యమంలో 700మంది రైతులు ప్రాణాలు కోల్పోగా, పలు ఘటనలు హింసాత్మకంగా మారాయి. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటన, లఖింపూర్ ఖేరి ఘటన అలాంటివి.

రిపబ్లిక్ డే కిసాన్ పరేడ్ హింసాత్మక ఘటన

రిపబ్లిక్ డే కిసాన్ పరేడ్ హింసాత్మక ఘటన


కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 26న రైతు సంఘాలు పిలుపునిచ్చిన ట్రాక్టర్ కవాతు సందర్భంగా వేలాది మంది ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.ఢిల్లీలోని సింగూ సరిహద్దు, తిక్రీ సరిహద్దు, ఘాజీపూర్ సరిహద్దులలో రైతులను నిలువరించడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించటం, అలాగే లాఠీ చార్జ్ చెయ్యటంతో 5 వేల మందికి పైగా నిరసనకారులు దేశ రాజధాని ఢిల్లీలోకి దూసుకు వచ్చారు. రైతులు రాకుండా అడ్డుకోవడానికి పెట్టిన బారికేడ్లను, ట్రక్కులను తోసుకుంటూ చారిత్రక కట్టడాలను ముట్టడించిన రైతులు ఢిల్లీ ఎర్రకోట మీద జండా ఎగరవేశారు.

ఎర్రకోటపై ఎగిరిన నిషాన్ సాహిబ్ జెండా... పోలీసులపై కొనసాగిన దాడి

ఎర్రకోటపై ఎగిరిన నిషాన్ సాహిబ్ జెండా... పోలీసులపై కొనసాగిన దాడి

సింఘు మరియు ఘాజీపూర్ నుండి అనేక మంది నిరసనకారులు తమ మార్గాన్ని మార్చుకున్న తర్వాత, వారు సెంట్రల్ ఢిల్లీ యొక్క ఐటీవో మరియు ఎర్రకోట వైపు ర్యాలీ చేశారు. అక్కడ పోలీసులు బాష్పవాయువు ప్రయోగించటం ,లాఠీ ఛార్జీని చెయ్యటంతో ట్రాక్టర్స్ మార్చ్ కాస్తా హింసాత్మకంగా మారింది. కొంతమంది రైతులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేసి పోలీసు సిబ్బందిపై దాడి చేశారు. ఎర్రకోట వద్ద, నిరసనకారులు ఒక విభాగం స్తంభాలు మరియు గోడలు ఎక్కి నిషాన్ సాహిబ్ జెండాను ఎగురవేశారు. ఈ గందరగోళంలో ఒక నిరసనకారుడు మరణించాడు. ఒకపక్క దేశరాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంటే చోటు చేసుకున్న ఈ ఘటన ఒక్కసారిగా యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసింది. రైతుల ఉద్యమ తీవ్రతను స్పష్టం చేసింది.

ఎర్రకోట హింసాకాండ .. 44కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు, 127 మంది అరెస్ట్

ఎర్రకోట హింసాకాండ .. 44కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు, 127 మంది అరెస్ట్


రైతులు నిర్వహించిన ట్రాక్టర్స్ ర్యాలీ హింసాత్మకంగా మారడంతోసీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం పలువురు రైతులపై కేసులు నమోదు చేసింది.రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు 44కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, 127 మందిని అరెస్టు చేశారు.ఖలిస్తాన్ ఉగ్రవాదులు అంటూరైతులపై ముద్రవేసే ప్రయత్నం చేసింది. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుందని రైతులు మండిపడ్డారు. ఆ తర్వాత రైతు సంఘాల లో చీలిక వచ్చి కొందరు ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఆందోళన కు ఫుల్ స్టాప్ పడుతుందని అంతా భావించారు. కానీ సాగు చట్టాల రద్దు కోసం రైతులు మళ్లీ ఐకమత్యంగా పోరాటం సాగించారు.ప్రభుత్వ అణచివేతను ఎదుర్కొంటూనే రైతులు తమ ఉద్యమ పంథాను కొనసాగించారు.

లఖింపూర్ ఖేరి ఘటన ... రైతుల ఉద్యమంలో అత్యంత విషాదకర ఘటన

లఖింపూర్ ఖేరి ఘటన ... రైతుల ఉద్యమంలో అత్యంత విషాదకర ఘటన

రైతులు సాగించిన ఏడాది ఉద్యమ ప్రస్థానంలో అత్యంత విషాదకరమైన ఘటన లఖింపూర్ ఖేరి సంఘటన . ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, యుపి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య లు బన్బీర్ పూర్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో, మంత్రులు పాల్గొనబోయే కార్యక్రమంలో నిరసన తెలియజేయడానికి భారతీయ కిసాన్ యూనియన్ కు చెందిన పలువురు రైతులు నల్లజెండాలతో వెళ్లారు .టికోనియా బన్బీర్ పూర్ రోడ్డులో కాన్వాయ్ వెంట నినాదాలు చేస్తూ నిరసన తెలియజేస్తున్న రైతులకు మీదికి కాన్వాయ్ లోని ఓ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.ఆ తర్వాత చోటు చేసుకున్న ఉద్రిక్తతల మధ్య మొత్తంగా లఖింపూర్ కేరి ఘటనలో 9 మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున చెలరేగిన హింసాకాండ రాజకీయ ప్రకంపనలు రేపింది.

లఖింపూర్ ఖేరి ఘటనపై ఏర్పాటైన సిట్, కేంద్ర మంత్రి కుమారుడిపై అభియోగాలు

లఖింపూర్ ఖేరి ఘటనపై ఏర్పాటైన సిట్, కేంద్ర మంత్రి కుమారుడిపై అభియోగాలు

నలుగురు రైతులు మరణించగా బిజెపి కార్యకర్తలతో పాటు ఒక జర్నలిస్టు మృతి చెందాడు. లఖింపూర్ ఖేరి ఘటన బిజెపి సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారింది.లఖింపూర్ ఖేరి ఘటన నేపథ్యంలోనూరాజకీయ రగడ కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ఆందోళనకు దిగింది.ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతుల పై జరిగిన హింసాకాండ పై సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి మరీ దర్యాప్తు చేస్తున్నారు.ఈ సంఘటనపై రెండు ప్రథమ సమాచార నివేదికలు (FIR) టికునియా పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయబడ్డాయి. ఘటనకు కారణమైన కారును కేంద్ర సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా నడుపుతున్నట్లు సమాచారం . అయితే మంత్రి అజయ్ మిశ్రా ఆ అభియోగాన్ని తిరస్కరించాడు. ఆరు రోజుల పాటు పోలీసుల విచారణ నుండి తప్పించుకున్నాడు.

లఖింపూర్ ఖేరి ఘటన దర్యాప్తు పర్యవేక్షణ కోసం పంజాబ్ హైకోర్టు మాజీ జడ్జి

లఖింపూర్ ఖేరి ఘటన దర్యాప్తు పర్యవేక్షణ కోసం పంజాబ్ హైకోర్టు మాజీ జడ్జి

ఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత ఆశిష్ మిశ్రా ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరయ్యారు. అతన్ని 9 అక్టోబర్ 2021న అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. 15 నవంబర్, 2021న సుప్రీం కోర్ట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని మరింత మంది సీనియర్ పోలీసు అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని "అప్‌గ్రేడ్" చేయవలసిందిగా ఆదేశించింది . తాజాగా ఈ దర్యాప్తును పర్యవేక్షించడం కోసం పంజాబ్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రాకేష్ కుమార్ జైన్ నుసుప్రీం కోర్టు నియమించింది.

విషాదకర ఘటనలు ఎన్నో ఉన్నా సరే ఫైనల్ గా రైతుల విజయం

విషాదకర ఘటనలు ఎన్నో ఉన్నా సరే ఫైనల్ గా రైతుల విజయం

కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం లేదని ఆత్మహత్యకు పాల్పడిన రైతులు ఎందరో ఉన్నారు. గ్రామాలలో వ్యవసాయం చేసే బాధ్యతను కుటుంబానికి అప్పగించి సంవత్సరకాలంగా దేశ రాజధాని ఢిల్లీలో, ఉద్యమం చేస్తున్న రైతులు ప్రభుత్వ నిర్ణయం మార్చుకోదేమో అన్న ఆందోళనలో ఉన్నారు.ఈ సమయంలో కేంద్ర సర్కార్ నిర్ణయాన్ని మార్చుకుంటూ మూడువ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామనిప్రకటించడంరైతన్నలు సాధించిన విజయం.ఎంతో మంది రైతుల ప్రాణ త్యాగఫలం.దేశవ్యాప్తంగా రైతుల కోసం సాగించిన ఐక్యతాఉద్యమానికి నిదర్శనం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+