ఆ రైతులు పిరికివాళ్లు, క్రిమినల్స్: హర్యానా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఛండీగర్: రైతుల ఆత్మహత్యలపై హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు పిరికివాళ్లు, క్రిమినల్స్ అని వ్యాఖ్యానించారు. అలాంటివారికి తాము ఎందుకు సాయం చేస్తామని మంత్రి ధన్‌కర్ ప్రశ్నించారు.
భారతీయ చట్టాల ప్రకారం ఆత్మహత్య చేసుకోవటం నేరమని ధన్‌కర్ పేర్కొన్నారు. చట్టాన్ని అతిక్రమించి ప్రాణాలు తీసుకునేవారు చట్టప్రకారం నేరస్తులేనని, అటువంటి వారికి ప్రభుత్వం సాయం చేయదని ఆయన పేర్కొన్నారు.

పిరికవాళ్లే ఆత్మహత్యలు చేసుకుంటారని, తమ బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి ఆత్మహత్యలను చేసుకుంటున్నారని మంత్రి ధన్‌కర్ విమర్శించారు. ఏప్రిల్ 22 వరకు అందిన నివేదికల ప్రకారం.. హర్యానాలో 13 ఎకరాల పంట నష్టం జరిగింది. అదికాక, 3.17 ఎకరాల పంటకు 76 నుంచి100శాతం మధ్య నష్టం వాటిల్లింది.
1.92లక్షల ఎకరాలు ఎకరాల పంట 51 నుంచి 75శాతం మధ్య, 8.24 ఎకరాల పంటకు 25నుంచి 50శాతం వరకు నష్టం జరిగింది. కాగా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ మంగళవారం నష్టపోయిన రైతుల కోసం రూ. 1,092 కోట్లు పరిహారంగా ప్రకటించారు. మరో రూ. 720 కోట్ల పరిహారం కేంద్రం నుంచి అందనుందని ఆయన తెలిపారు.
ఇది ఇలా ఉండగా, రైతుల ఆత్మహత్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతుంటే.. హర్యానా మంత్రి అనాలోచిత వ్యాఖ్యలపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications