వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫామ్ హౌస్, 170 ఎకరాల పార్క్: రూ.1,271 కోట్ల చోక్సీ ఆస్తులు సీజ్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ మేనమామ, వజ్రాల వ్యాపారి మెహుల్‌కు చెందిన ఆస్తులను దర్యాప్తు అధికారులు సీజ్ చేశారు. వాటి విలువ ర.1,200 కోట్ల మేర ఉంటుంందని అంచనా.

గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ అయిన చోక్సీకి చెందిన 41 ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడి) చెప్పింది. వాటిలో ముంబైలోని 15 ఫ్లాట్లు 17 కార్యాలయాల ఆవరణలు ఉన్నాయి.

Farmhouse, 170-acre Park: Mehul Choksi's Assets Worth 1,271 Crores Seized

కోల్‌కతాలోని మాల్, అలిబాగ్‌లో 4 ఎకరాల ఫామ్ హౌస్, తమిళనాడులోని విల్లుపురం, నాసిక్, నాగపూర్, పాన్వెల్ వంటి ప్రాంతాల్లో ఉన్న 231 ఎకరాల భూములు, రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న 170 ఎకరాల పార్కు ఈడి స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో ఉన్నాయి. హైదరాబాదు సమీపంలోని పార్కు విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా.

ఈడీ స్వాధీనం చేసుకున్న 41 ఆస్తుల విలువ 11,217.2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 12 వేల కోట్ల పిఎన్‌బి కుంభకోణంలో నీరవ్ మోడీతో పాటు ఇతరులపై విచారణ జరుగుతోంది. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ జనవరి మొదటివారంలో దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. అయితే, తామేమీ తప్పు చేయలేదని వారంటన్నారు.

English summary
Properties of diamond billionaire Mehul Choksi valued at over Rs. 1,200 crore have been seized by investigators in the PNB fraud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X