ఉత్తరప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 11మంది మృతి..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదకొండుమంది మృతిచెందగా, మరో పదిమంది తీవ్ర గాయలపాలయ్యారు. రాష్ట్రంలోని పూర్ణగిరి మాత దర్శనానికి వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షాజహాన్ పూర్ జిల్లాలోని ఖుతర్ వద్ద ఓ దాబా వద్ద ఆగిఉన్న వోల్వో బస్సుపై ఓవర్ లోడ్ తో వస్తున్న డంపర్ అదుపుతప్పి పడిపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
నిన్న (శనివారం) అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ వోల్వో బస్సులో సుమారు 40 మందికి వరకు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా సీతాపూర్ సింధౌలీ నుంచి ఉత్తరాఖండ్‌లోని పూర్ణగిరి మాత దర్శనానికి బయలుదేరుతున్నారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానికులు ఇచ్చిన పూర్తి సమచారం మేరకు..యూపీలోని సీతాపూర్ సింధౌలీ నుంచి దాదాపు 40 మంది వరకు భక్తులు ఉత్తరాఖండ్ లోని పూర్ణగిరి మాత దర్శనానికి వోల్వో బస్సులో వెళ్తున్నారు. షాజహాన్ పూర్ లోని ఓ దాబా వద్ద భోజనం కోసం బస్సును డ్రైవర్ రోడ్డు పక్కన ఆపివేశాడు. బస్సులోని కొందరు ప్రయాణికులు భోజనానికి దాబాలోకి వెళ్లగా.. మరికొందరు బస్సులోనే నిద్రిస్తూనే ఉన్నారు.
ఇదే సమయంలో అటువైపుగా వస్తున్న ఓ డంపర్ అదుపుతప్పి వోల్వో బస్సును ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సుపై బోల్తాపడటంతో బస్సులో ఉన్న 11 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మరణించారు. మరో పది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications