ఛత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి..
ఛత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న వ్యాన్‌ను కారు ఢీకొట్టింది. దీంతో 9 మంది ప్రాణాలు విడిచారు. మరో 23 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతిచెందినవారిలో ముగ్గురు చిన్నారులున్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలోని బెమెతర జిల్లాలో చోటుచేసుకుంది. మినీ ట్రక్కును సరుకు రవాణా వాహనం ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయినవారు పాతర్రా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం, బెమెతర జిల్లాలోని తిరయ్య గ్రామంలో జరిగిన శుభకార్యానికి వెళ్లిన బాధితులు ఆదివారం రాత్రి తిరుగుపయనమయినప్పడు ఈ ప్రమాదం సంభవించింది. మినీ ట్రక్కును కథియా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన కాసేపు డ్రైవర్ ఆపివేసాడు. ఇంతలో అటుగా వస్తున్న ఓ సరకు వాహనం వచ్చి మినీ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే తొమ్మిది మంది మరణించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని రాయ్‌పుర్ ఆస్పత్రిలో చేర్పించి వారికి చికిత్స అందిస్తున్నారు.

కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
చనిపోయిన వారిలో భూరి నిషాద్ (50), నీరా సాహు (55), గీతా సాహు (60), అగ్నియా సాహు (60), ఖుష్భూ సాహు (39), మధు సాహు (5), రికేశ్ నిషాద్ (6), ట్వింకిల్ నిషాద్ (6)గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్ర్రకియను చేపట్టారు. ఆ సరుకు రవాణా డ్రైవరు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన్టలు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications