వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చనిపోయిన తండ్రికి ఇంట్లోనే నెలపాటు ఆయుర్వేద వైద్యం

|
Google Oneindia TeluguNews

భోపాల్ : అతను ఉన్నత విద్యవంతుడు. ఉన్నతోద్యోగి కూడా. కానీ ఆయన రక్తబంధాన్ని వదులుకోలేదు. ఎంతలా అంటే శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ చనిపోయిన తన తండ్రి శవానికి నెలరోజులు ఆయుర్వేద వైద్యం చేస్తూ వార్తల్లో నిలిచాడు.

ఉన్నత ఉద్యోగి మూఢ నమ్మకం ..

ఉన్నత ఉద్యోగి మూఢ నమ్మకం ..

రాజేంద్రకుమార్ మిశ్రా .. 1987 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. అతను ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీసు శాఖలో అడిషనల్ డీజీ హోదాలో పనిచేస్తున్నారు. కానీ తన పేగుబంధాన్ని వదులుకోలేక .. చనిపోయిన తన తండ్రి బతికొస్తాడనుకొని ఆయుర్వేద వైద్యం చేస్తూ తనలోని మూర్ణత్వాన్ని చాటుకున్నాడు.

నెలరోజులపాటు ఇంట్లో వైద్యం

నెలరోజులపాటు ఇంట్లో వైద్యం

రాజేంద్రం తండ్రి కేఎం మిశ్రా .. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న తండ్రిని బన్సాల్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. జనవరి 13న హాస్పిటల్లో జాయిన్ చేసి .. చికిత్స అందించాడు. అయిన ఫలితం లేకపోయింది. మిశ్రా చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరీంచి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. అక్కడినుంచి శ్మశనానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాల్సిన కుమారుడు .. తన తండ్రి పార్థీవదేహాన్ని తాను ఉండే 74 బంగ్లా ప్రాంతానికి తరలించారు. పోలీసు ఉన్నత ఉద్యోగి అయిన మిశ్రా .. ఉండే ఈ చోట మంత్రులు, ఐఏఎస్ అధికారులు నివసిస్తుంటారు. ఇలాంటి చోట తండ్రికి ఆయుర్వేద వైద్యం చేయడం ... అది నెలరోజులపాటు ట్రీట్ మెంట్ కొనసాగడం కలకలం రేపుతోంది.

అలా తెలిసింది ...

అలా తెలిసింది ...

ఈ విదారకర ఘటన రాజేంద్ర ఇంటి వద్ద బందోబస్త్ కోసం వేసిన కానిస్టేబుల్ ద్వారా తెలిసింది. స్పెషల్ ఆర్ముడ్ ఫోర్స్ కు చెందిన కానిస్టేబుల్ ఇంటి వద్ద బందోబస్త్ కోసం ఉండగా .. చుట్టుపక్కల వారు మాట్లాడుతుండగా విషయం అర్థమైంది. ఏంటా అని ఆరాతీస్తే అసలు సంగతి బయటపడింది.

ఇదేమీ చికిత్స ...

ఇదేమీ చికిత్స ...

ఈ అంశంపై రాజేంద్ర మిశ్రాను మీడియా ప్రశ్నిస్తే .. తన తండ్రి ఆయుర్వేద ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్నారని సెలవిచ్చారు. బన్సాల్ ఆస్పత్రి సిబ్బంది అందించిన వైద్యం ... చనిపోయారని అందజేసిన సర్టిఫికెట్ గురించి మాత్రం స్పందించలేదు

English summary
senior IPS officer in Bhopal is making his father undergo ayurvedic treatment at home, a month after a top city hospital declared him dead and issued a death certificate as well. KM Mishra, 84, the father of Rajendra Kumar Mishra, a 1987 batch IPS officer, presently posted as ADG, Selection, at the PHQ was admitted at the Bansal Hospital on January 13 with a pulmonary disorder and, as per hospital records, declared dead on the evening of January 14. Mishra took his father to his residence at the 74 Bungalows locality, which houses mostly ministers and top civil servants where he has been undergoing treatment by ayurved methodology. The bizarre incident came to light when constables of the Special Armed Force (SAF) posted at Mishra's residence as domestic helps spoke out to certain people about it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X