అక్రమ సంబంధం, కోడలిని హత్య చేసిన మామ, కాదు అందుకే చంపాడు, థ్రిల్లర్ స్టోరీ, అసలు కథ !

సేలం/చెన్నై: కొడుకు కళ్లుకప్పి మాయమాటలు చెప్పి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తున్న కోడలు ఇంటి పరువు తీస్తోందని ఆరోపిస్తూ మామ ఆమెను దారుణంగా హత్య చేశాడు. కుటుంబం పరువు బజారుకు ఈడ్చిన ఇలాంటి కోడలు బతికుంటే తన కొడుకుతో పాటు మా కుటుంబానికి ఎప్పటికైనా ఇబ్బందులు ఎదురౌతాయని ఆమెను హత్య చేశానని పోలీసుల విచారణలో మామ అంగీకరించాడు. అయితే పోలీసుల కథ వేరుగా ఉంది. కొడుకు ఆఫీస్ కు వెళ్లిన వెంటనే పరాయి వ్యక్తితో రాసలీలలు సాగిస్తున్నావని, తన కోరిక తీర్చాలని మామ కోడలి మీద ఒత్తిడి చేశాడని, అందుకు ఆమె నిరాకరించడంతో దారుణంగా హత్య చేశాడని పోలీసులు అంటున్నారు. అయితే ఈ థ్రిల్లర్ స్టోరీ మరో మలుపు తిరిగింది. అసలు కథ తెలీక కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు.

దంపతులు, పిల్లలతో వేరు కాపురం

దంపతులు, పిల్లలతో వేరు కాపురం

తమిళనాడులోని సేలం జిల్లా తంబంపట్టి సమీపంలోని ఉలిపురం నరికరడు ప్రాంతంలో అరివళగన్ (45), అముద (40) దంపతులు నివాసం ఉంటున్నారు. అరివళగన్, అముద దంపతులకు అజిత్ (19), హృతిక్ (16) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు అరివళగన్ కో- ఆపరేటివ్ సొసైటీలో సేల్స్ మెన్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

కోడలి అక్రమ సంబంధం

కోడలి అక్రమ సంబంధం

భర్త అరివళగన్ ఉద్యోగానికి, కుమారులు కాలేజ్ కు వెళ్లిన తరువాత అముద వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటిలాగే ఉదయం భర్త అరివళగన్ ఉద్యోగానికి, కుమారులు అజిత్, హృతిక్ కాలేజ్ కు వెళ్లారు. ఇంటిలో అముద మాత్రమే ఉంది.

ఇంటిలోకి మామ ఎంట్రీ

ఇంటిలోకి మామ ఎంట్రీ

ఉదయం అరివళగన్ ఉద్యోగానికి వెళ్లిన తరువాత ఆయన తండ్రి పళని (63) ఇంటిలోకి వెళ్లాడు. తరువాత ఇంటి లోపల గడియ పెట్టాడు. ఆ సమయంలో ఇంటిలో పళని, ఆయన కోడలు అముద గొడవపడ్డారని తెలిసింది. తరువాత పళని కొడవలి తీసుకుని కోడలు అముదపై దాడి చేశాడు. అముద గట్టిగా కేకలు వేసింది. ఇరుగు పొరుగు వారు వచ్చి అముద ఇంటి తలుపులు పగలగొట్టారు.

బ్యాక్ డోర్ లో మామ పరార్

బ్యాక్ డోర్ లో మామ పరార్

అముద మీద కొడవలితో దాడి చేసిన ఆమె మామ పళని ఇంటి వెనుక డోర్ నుంచి పరారైనాడు. ఇరుగు పొరుగు వారు అముద ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న అముదను చూసి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అముద ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వైద్యులు చెప్పారు.

అక్రమ సంబంధం, అందుకే చంపేశా ?

అక్రమ సంబంధం, అందుకే చంపేశా ?

తన కోడలు అముదను హత్య చేసి పారిపోయిన పళని కోసం పోలీసులు గాలించారు. చివరికి మామ పళనిని పోలీసులు పట్టుకున్నారు. తన కొడుకు అరివళగన్ కళ్లు గప్పి తన కొడలు అముద వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తోందని, అందుకే కుటుంబం పరువు పొతుందని, ఎప్పటికైనా ఈమె మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందని చంపేశానని పళని పోలీసులకు చెప్పాడు.

పోలీసుల స్టోరీ వేరే !

పోలీసుల స్టోరీ వేరే !

కోడలు అముద వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తున్న విషయం పళనికి తెలిసిందని, కొంత కాలంగా ఆమె మీద మామ కన్ను వేశాడని పోలీసులు అంటున్నారు. తన కొడుకు తెలీకుండా వేరే వ్యక్తికి శారీరక సుఖం ఇస్తున్నావని, ఆ సుఖం తనకు ఇవ్వాలని మామ పళని కొడలు అముదకు చెప్పాడని పోలీసులు అన్నారు. తన లైంగిక కోరిక తీర్చడానికి అముద అంగీకరించకపోవడంతో మామ పళని ఆవేశంతో ఆమెను హత్య చేశాడని మా విచారణలో వెలుగు చూసిందని పోలీసులు అంటున్నారు. కోడలు అముదను హత్య చేసిన మామ ఓ స్టోరీ, పోలీసులు ఓ స్టోరీ చెప్పడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+