ఐఐటీకి పంపించి తప్పు చేశా..: ఢిల్లీ పీహెచ్‌డీ విద్యార్థి మృతిపై తండ్రి ఆవేదన!
సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తున్నానని, అందుకోసం రూ.25లక్షలు తీసుకోవాల్సిందిగా తమ కూతురిపై రితేశ్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో మంజుల అనే పీహెచ్‌డీ విద్యార్థి ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కుమార్తె ఆత్మహత్య పట్ల తాజాగా ఆమె తండ్రి స్పందించారు. అసలు తన కుమార్తెను ఉన్నత చదువులకు పంపించకుండా ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న వయసులోనే తమ కూతురికి పెళ్లి చేసి తప్పు చేశామన్నారు. జాతకాలు కలిశాయని పెళ్లి చేస్తే.. ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు. అల్లుడు రితేశ్ కు తమ కూతురు చదువుకోవడం ఇష్టం లేదని, చదువు మానేయాలని తరుచూ ఒత్తిడి తెచ్చేవాడని పేర్కొన్నారు.

సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తున్నానని, అందుకోసం రూ.25లక్షలు తీసుకోవాల్సిందిగా తమ కూతురిపై రితేశ్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. కేవలం కుటుంబ పరువు పోతుందన్న ఉద్దేశంతోనే తమ కూతురు విడాకుల జోలికి వెళ్లలేదన్నారు. కట్నం ఇచ్చేందుకు తాను డబ్బు కూడబెట్టి ఉండాల్సిందన్నారు.
కాగా, గతంలో అమెరికాలో సివిల్ ఇంజనీర్ గా పనిచేసిన మంజుల 2011లో ఢిల్లీ ఐఐటీలో చేరింది. జలవనరులపై ఆమె పరిశోధన సాగిస్తోంది. ఇటీవల క్యాంపస్ ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో పోలీసులు ఆమె తల్లిదండ్రులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మంజుల ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకుని, ఆమె మొబైల్ ఫోన్ కాల్స్ వివరాలు సేకరిస్తున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications