అనారోగ్యంతో ఫాదర్ స్టాన్ స్వామి మృతి

ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టై, జైలు జీవితం గడుపుతున్న ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు స్టాన్‌ స్వామి మృతి చెందినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఆయన మరణవార్తను ధృవీకరిస్తూ జెస్యూట్ ప్రోవిన్షియల్ ఆఫ్ ఇండియా తరఫున డాక్టర్ స్టానిలాస్ డిసౌజా ఒక సంతాప సందేశాన్ని విడుదల చేశారు.

స్టాన్ స్వామీ

స్టాన్ స్వామి వయసు 84 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న స్టాన్ స్వామి ముంబైలోని బాంద్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో మే నెలలో ఆయనను ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం నాటికి ఆయన ఆరోగ్యం విషమించడంతో స్టాన్ స్వామికి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన లాయర్లు సోమవారం ఉదయమే బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నం 2.30 ఉండగా, ఆయన మృతి చెందినట్లు లాయర్లు బాంబే హైకోర్టుకు తెలిపారు.

https://twitter.com/kavita_krishnan/status/1411977659777642499

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+