కులాంతర వివాహం: రక్షణకు 50వేలు, దాడి, ఊరినే వదిలిపెట్టిన జంట
పాట్నా: కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట ప్రాణ భయంతో ఊరినే వదిలిపెట్టింది. తమ వివాహాన్ని ఆమోదించేందుకు పంచాయతీ పెద్దలు రక్షణగా ఉండేందుకు రూ.50 వేలు అడిగారు. పంచాయితీ పెద్దలు అడిగిన మొత్తాన్ని చెల్లించకుంటే చంపేస్తామని బెదిరించారు.
దీంతో ఆ ప్రేమజంట ఆ గ్రామాన్నే వదిలేసిన సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. కతిహార్ జిల్లాలోని గోగ్రా గ్రామానికి చెందిన చోటూకుమార్ యాదవ్, తన పక్క గ్రామానికి చెందిన సోనీ దేవీలు 6నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు.

నెలరోజుల క్రితం వారి చోటూ కుమార్ తల్లిదండ్రులు వారి వివాహాన్ని అంగీకరించడంతో భార్యతో కలిసి గ్రామానికి వచ్చాడు. దీంతో ఆగ్రహించిన పంచాయితీ పెద్ద దినేష్‌యాదవ్ రూ.50వేలు ఇస్తేనే గ్రామంలో ఉండనిస్తానని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు.
అంతటితో ఆగకుండా దినేష్, అతని మనుషులు చోటూకుమార్ కుటుంబసభ్యులపై దాడి చేశారు. దీంతో భయపడిపోయిన చోటు కుమార్, సోని ఊరి విడిచి వెళ్లిపోయారు. అరిహనా గ్రామానికి చెందిన పంచాయితీ పెద్ద మహేందర్ రవిదాస్ ప్రాణభయంతోనే వారు ఊరు వదిలి వెళ్లిపోయారని తెలిపారు.












Click it and Unblock the Notifications