నేనే కాదు, వాళ్లు కూడా: మోడీ, సల్మాన్ ఖాన్‌లపై రాఖీ సావంత్
తానే కాదు.. మోడీ, బాబా రామ్‌దేవ్, సల్మాన్ ఖాన్ కూడా ఒంటరి జీవితమే గడుపుతున్నారని, ఇలా ఉండడం ఆనందంగానే ఉందని రాఖీ సావంత్ అన్నారు.
ముంబై: ఇప్పటి వరకు ఒంటరిగా జీవించడమే ఆనందంగా ఉందని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అన్నారు. బాబా రామ్‌దేవ్, ప్రధాని మోడీ, సల్మాన్ ఖాన్.. వీళ్లంతా సింగిల్‌గానే ఉన్నారని, వాళ్లను చూసి తాను కూడా ప్రస్తుతానికి అలాగే ఉండాలని అనుకుంటున్నానని ఆమె చెప్పారు.
అయితే తన సహచర భాగస్వామిని ఎంచుకునేందుకు మరోసారి రాఖీ కా స్వయంవర్ రియాల్టి షోను నిర్వహిస్తానని చెప్పారు. రాఖీ సావంత్ క్రేజీ 4,1920 వంటి చిత్రాల్లో నటించారు. 2009లో ఇదే పేరుతో నిర్వహించిన రియాలిటీ షో మొదటి సీజన్‌లో కెనడా వ్యాపారవేత్త ఈలేష్ పరుజన్‌వాలను తన భర్తగా ఎంచుకుంది.

తర్వాత అభిప్రాయభేదాలతో ఇద్దరు విడిపోయారు. డబ్బు కోసమే తాను ఈలేష్‌ను ఇష్టపడ్డానని ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో రాఖీ చెప్పారు. సరైన జోడీ దొరికే వరకు పెళ్లి అనేది తన కార్డులో లేదని ఆమె చెప్పారు. తనకు కాబోయే భర్త కష్టపడి పనిచేసేవాడు, సంపన్నుడు, కలివిడి గలవాడు, శక్తిమంతుడు అయి ఉండాలని ఆమె చెప్పారు.
అలాంటివాడిని వెతికి పట్టుకునేందుకే తాను స్వయంవరాన్ని మరోసారి నిర్వహించాలని అనుకుంటున్నానని చెప్పారు. కాగా, రాఖీ సావంత్ పెళ్లి చేసుకుంటే మంచిదని ఆణె స్నేహితురాలు, హాలీవుడ్నటి సోఫియాహయత్ అన్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications