• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇంటికొచ్చినట్లుంది : అమేథీ ప్రజలతో రాహుల్, ఓడిపోయిన తర్వాత తొలిసారి...

|

అమేథీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందడమే కాదు .. పెట్టిన కోట అయిన అమేథీ నుంచి రాహుల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. రాహుల్‌ను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మట్టి కరిపించారు. ఈ క్రమంలో అమేథీ ప్రజలకు దగ్గరయ్యేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ అమేథీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

 అమేథీలో పర్యటన

అమేథీలో పర్యటన

కాంగ్రెస్ కార్యకర్యలు, శ్రేణులను కలిశారు రాహుల్ గాంధీ. ప్రజలను సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి అమేథీలో అడుగిడిన రాహుల్ .. ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అమేథీకి రావడంతో మళ్లీ తన సొంత ఇంటికి వచ్చినట్టు ఉందని పేర్కొన్నారు. ఏంతైనా తన పాత నియోజకవర్గమే కదా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట అమేథీ నుంచి రాహుల్ మూడుసార్లు ఎంపీగా విజయం సాధించారు. 2004, 2009, 2014లో ఇక్కడినుంచి ఎంపీగా విజయబావుగా ఎగరవేశారు. గత ఎన్నికల్లో స్మృతి ఇరానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014లో బీజేపీ నుంచి పోటీచేసి .. ఓడిపోయిన స్మృతి అమేథీ ప్రజలతో మమేకవుతూ వచ్చారు. దీంతో ఆమెకు పట్టం కట్టారు.

ఇదీ విషయం ..

ఇదీ విషయం ..

మరోవైపు తన ట్విట్టర్ ఫాలొవర్ల సంఖ్య 10 మిలియన్లకు చేరుకోవడంతో యూజర్లకు రాహుల్ ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని అమేథీ ప్రజలతో పంచుకుంటానని నిన్ననే ట్వీట్ చేశారు రాహుల్. కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు, మద్దతుదారులతో గడుపుతానని తెలిపారు. చెప్పినట్టుగానే అమేథీ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు నెలన్నర తర్వాత అమేథీలో .. సోషల్ మీడియా వేదిక జరిగిన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ కంచుకోటలో మళ్లీ ఆ పార్టీ జెండా ఎగరేసేందుకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

రాజీనామాస్త్రం ...

రాజీనామాస్త్రం ...

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 సీట్లతో సరిపెట్టుకుంది. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత పదవీ చేపట్టేందుకు కూడా విముఖత చూపారు. పార్టీ నేతలకు దూరంగా ఉన్నారు. అధ్యక్ష పదవీకి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని సోనియా, ప్రియాంక, ఇతర సీనియర్ నేతలు చెప్పినా వినిపించుకోలేదు. అధ్యక్ష పదవీకి రాజీనామా చేయడంతో .. తాత్కాలిక అధ్యక్షుడగా మోతిలాల్ వోరాను కాంగ్రెస్ పార్టీ నియమించిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి అధ్యక్షుడిని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి (సీడబ్ల్యూసీ) ఎన్నుకోనుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి రాహుల్ రాజీనామా చేసి ట్వీట్ చేశాక .. ఫ్రొపైల్ కూడా మార్చివేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా మార్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On his first visit to Amethi on Wednesday since his defeat to Union minister Smriti Irani in the Lok Sabha elections, Congress leader Rahul Gandhi took to Twitter to express joy at returning to his former constituency. “I feel very happy after coming to Amethi. It feels like coming home,” Gandhi tweeted. Earlier in the day, he acknowledged his followers on Twitter which has risen to 10 million with a thank you note ahead of the visit to Amethi. “10 Million Twitter followers - thank you to each and every one of you! I will celebrate the milestone in Amethi, where I will be meeting our Congress workers & supporters today,” Rahul Gandhi tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more