ఫెరా కేసు విచారణ: ఈడీ ఫిర్యాదు, టీటీవీ దినకరన్ ను పట్టుకురండి: కోర్టు ఆదేశాలు, చిక్కుల్లో!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: టీటీవీ దినకరన్ కు మరో చిక్కు ఎదురైయ్యింది. విదేశాల నుంచి అక్రమ లావాదేవీలు జరిపారని నమోదు అయిన ఫెరా కేసులో విచారణ చేస్తున్న ఈడీ అధికారులకు సహకరించలేదని ఆరోపణలు ఎదురైనాయి. టీటీవీ దినకరన్ ను పట్టుకురావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఫెరా కేసు విచారణ సోమవారం చెన్నైలోని ఎకనామిక్ ఎఫెన్స్ -2 కోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తి ఎస్. మలర్మతి కేసు విచారణ చేశారు. 20 ఏళ్ల కిత్రం నమోదు అయిన ఫెరా కేసు విచారణకు టీటీవీ దినకరన్ సహకరించడం లేదని ఈడీ అధికారులు న్యాయమూర్తికి చెప్పారు.

FERA case court directs TTV Dinakaran appear before court

టీటీవీ దినకరన్ కారణంగా కేసు విచారణ ఆలస్యం అవుతోందని, విచారణకు ఆయన సహకరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈడీ అధికారులు కోర్టులో మనవి చేశారు. ఈడీ అధికారుల విచారణకు సహకరించని టీటీవీ దినకరన్ ను ఈనెల 26వ తేదీన కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఎస్. మలర్మతి ఆదేశాలు జారీ చేశారు.

కోర్టు విచారణకు హాజరు కాకుండా, ఈడీ అధికారులకు సహకరించకుండా రాజకీయాలు చేస్తున్న టీటీవీ దినకరన్ కు చట్టపరంగా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. టీటీవీ దినకరన్ 26వ తేదీ కోర్టు ముందు హాజరుకాకుంటే ఆయన అరెస్టు అయ్యే చాన్స్ ఉందని సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
FERA violation case against TTV Dinakaran. Economic offences court-II Judge S Malarmathi order Dinakaran to enable Enforcement Directorate to bring him to Chennai court on October 26.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి