వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పండుగలకు ఉల్లి కొనాలంటే కష్టమే : ధర రెట్టింపు తప్పదంటూ : క్రిసిల్ హెచ్చరిక..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఉల్లి వినియోగించని ఇల్లు లేదు. పెరిగిన ఉల్లి ధరలు ప్రభుత్వాలనే మార్చేసాయి. ఎన్నో సార్లు దేశ వ్యాప్తంగా ఉల్లి ధరల పెంపు ప్రధాన సమస్యగా మారింది. ఇప్పుడు తాజాగా మరో సారి ఉల్లి ధరల పెంపు తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కురిసిన వర్షాల ఎఫెక్ట్ మరి కొద్ది రోజుల్లో పెరుగతాయని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉల్లి రేటు రెట్టింపు కావడం ఖాయమంటూ ప్రముఖ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ క్రిసిల్‌ హెచ్చరించింది. దేశ వ్యాప్తంగా ప్రతీ నెలా దాదాపుగా 13 లక్షల టన్నుల ఉల్లి వినియోగం ఉంటుందని అంచనా.

ఎమ్మెల్యే రోజా కూతురు అన్షు పుట్టిన రోజు వేడుకలు (ఫోటోలు)

ఉల్లి పంటను ముంచేసిన వర్షాలు

ఉల్లి పంటను ముంచేసిన వర్షాలు

అందులో సగం మార్కెట్ మహారాష్ట్ర నుంచే ఉంటుంది. దేశంలోని అనేక ప్రాంతాలకు ఉల్లి ప్రధానంగా ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. మహారాష్ట్ర తరువాతి స్థానాల్లో కర్ణాటక..ఆంధ్రప్రదేశ్ లో ఉల్లి ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే, తౌటే తుఫాను ఎఫెక్ట్ ఉల్లి పంటను ముంచేసింది. దీంతో పాటుగా సాగు చేయటం ఆలస్యం అయింది. కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో పంట చేతికి ఇప్పట్లో అందే అవకాశాలు కనిపించటం లేదు. దేశ వ్యాప్తంగా ఉల్లికి ఉన్న డిమాండ్ లో ప్రధానంగా 75 శాతం పంట ఖరీఫ్‌ సీజన్‌ నుంచే వస్తుంది.

ఉల్లి ధరలు రెట్టింపు ఖాయమంటూ

ఉల్లి ధరలు రెట్టింపు ఖాయమంటూ

అయితే ఈ సీజన్‌కి సంబంధించిన ఉల్లి పంట చేతికి రావడానికి మరింత సమయం పట్టవచ్చని క్రిసిల్‌ అంచనా వేస్తోంది. పంట చేతికి రావడం.. ప్రాసెసింగ్‌.. సరఫరా తదితర కారణాల వల్ల ఉల్లి మార్కెట్‌కి రావడానికి పట్టే సమయం సాధారణం కంటే అధిక సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. గత మూడేళ్లుగా ఉల్లి ఉత్పత్తి, సరఫరా, మార్కెట్‌ తదితర విషయాలను పరిగణలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు రెట్టింపు అవుతాయని హెచ్చరిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ పంట చేతికి రావడంలో ఆలస్యమైనా రబీలో వచ్చిన ఉత్పత్తి బఫర్‌ స్టాక్‌గా అందుబాటులో ఉంటుంది.

పండుగల నాటికి ధరల భారం తప్పదా

పండుగల నాటికి ధరల భారం తప్పదా

అయితే ఆగస్టు, సెప్టెంబరులో వర్షాల కారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో ఉల్లి త్వరగా పాడవుతుంది. వెరసి బఫర్‌ స్టాక్‌ సైతం తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉందని క్రిసిల్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇదే సమయంలో మహారాష్ట్రలో విస్తారంగా వానలు పడినా ఉల్లిపంట ఎక్కువగా పండే నాసిక్‌లో గత మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉల్లి రైతులు క్రమంగా నర్సరీలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉల్లి దిగుబడి శాతం గణనీయంగా తగ్గనుందని క్రిసిల్‌ అంచనా వేసింది. మొత్తంగా దసరా, దీపావళి సీజన్‌ నాటికి ఉల్లి ధరలు పెరుగుతాయని చెబుతోంది.

Recommended Video

Shikhar Dhawan సింగిల్.. ఇంతకీ ఎవరీ Ayesha Mukherjee | గబ్బర్ కంటే పదేళ్లు పెద్ద || Oneindia Telugu
ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలంటూ

ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలంటూ

ఉల్లి ఉత్పత్తిలో తేడాలను ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృస్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే ఇటువంటి పరిస్థితులు అంచనా వేసే దళారులు..కొందరు వ్యాపారులు కలిసి కృత్రిమ కొరత సృస్టించటానికి చేయని ప్రయత్నం ఉండదు. ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పినా..ఎన్నో సార్లు అధిక ధరలు-సరఫరా పడిపోవటం వంటి పరిస్థితులు దేశ వ్యాప్తంగా ఎదురయ్యాయి. దీంతో..ఇప్పుడు క్రిసిల్ హెచ్చరికలతో ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

English summary
As per Crisil report Onion rate may rise coming days in the period of dashara to Diwali. Dure heavy rains in many states and no rains in Nasik effcted onion production. Crisil alerts govt to control artificial crisis in onion market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X