యూపీలో ఒంటరిగా బరిలోకి.. పొత్తుల్లేవు: ప్రియాంక గాంధీ

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రధాన పార్టీలు భావిస్తాయి. ఎందుకంటే అక్కడ గెలిస్తే.. కేంద్రంలో అధికారం పక్కా అని విశ్లేషకులు మాట.. మరికొద్దీ రోజుల్లో యూపీ అసెంబ్లీ పోల్ జరగనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి అన్నీ ప్రియాంక గాంధీ తన భుజనా వేసుకున్నారు.

ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక ప్రకటన చేశారు. ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ లేదా బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం జరిగినప్పటికీ..వాటిని కొట్టిపారేస్తూ ప్రియాంక గాంధీ క్లారిటీ ఇచ్చారు. బులంద్‌షహర్‌లో ప్రతిగ్య సమ్మేళన్ లక్ష్య-2021 పదాదికారుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవద్దని పలువురు పార్టీ కార్యకర్తలు తనను కోరినట్లు తెలిపారు.

 field Congress workers on all seats in 2022 UP Assembly polls

అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, ఒంటరిగానే పోటీ చేస్తామని కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నట్లు ప్రియాంక గాంధీ చెప్పారు. ఒంటరిగా పోటీ చేస్తేనే మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందన్నారు. పొత్తులో భాగంగా చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఏ పార్టీతోనైతే పొత్తు పెట్టుకుంటున్నామో ఆ పార్టీ వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కు తోడై తక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందన్న కోణంలోనే ప్రియాంక గాంధీ ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదనే ప్రియాంక ప్రకటనతో యూపీ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.

ఇటు సీ ఓటర్ సర్వే మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంది. మళ్లీ బీజేపీ గెలుస్తోందని తెలిపింది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. యోగి హయాంలో నేరాలు జరిగినా.. అతని ప్రభుత్వం చేపట్టిన మంచి పనులను అందరూ చూస్తున్నారు. ఆ కోణంలో మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+