ఎలక్షన్ ఆఫర్ క్లోజ్.. పెట్రోల్ నింపుకోండి.. రాహుల్ గాంధీ సూచన

యూపీ 7వ విడత పోలింగ్ సోమవారం జరగనుంది. దీంతో 5 రాష్ట్రాల పోలింగ్ ముగియనుంది. సో.. పెట్రో వాత తప్పదు. అవును.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరిగిన.. ఎన్నిక నేపథ్యంలో పెంచడం లేదు. మరీ మంగళవారం పెట్రో, డీజిల్ ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పెట్రో మోత తప్పదని కామెంట్ చేశారు.

పెట్రోల్ రేట్ల పెరుగుదలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచనుందని అన్నారు. త్వరలోనే 'ఎన్నికల ఆఫర్'​ ముగుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజలు తమ వాహనాల పెట్రోల్ ట్యాంక్​లను నింపుకోవాలని సూచించారు. ఈ మేరకు ట్విట్టర్​వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

 Fill your petrol tanks before election offer ends: Rahul gandhi

ఎన్నికల సమయంలో పెట్రో ధరల పెంపును నిలిపివేసి, పోలింగ్ ముగియగానే బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతోందని మండిపడ్డారు. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉత్తరప్రదేశ్​సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మార్చి 7తో ముగుస్తాయి. మార్చి10న ఓట్ల లెక్కింపు జరగనుంది. మరోవైపు ఉక్రెయిన్‌ - రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెట్రో ధరలు భారీగా మండిపోనున్నాయి.

గతేడాది నవంబర్‌ నుంచి దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీనిపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు 110 అమెరికన్‌ డాలర్లు దాటాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ.. దేశీయ మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మారలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+