Ajit Pawar Plane: ఫ్లైట్ క్రాష్ ఇలా-11 నిమిషాల్లో ఏం జరిగిందో వెల్లడించిన కేంద్రం..!
మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణంగా మంచును గుర్తించారు. అయితే ఈ దుర్ఘటన జరగడానికి ముందు ఏం జరిగింది, ముఖ్యంగా చివరి 11 నిమిషాల్లో ఏం జరిగిందో వివరిస్తూ పౌర విమానయానశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో పవార్ ప్రయాణిస్తున్న విమాన పైలట్లు ప్రమాదానికి ముందు ఏటీసీకి ఇచ్చిన సమాచారాన్ని పొందుపర్చింది.
11 నిమిషాల్లో ఏం జరిగింది ?
అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం బారామతి ఎయిర్ పోర్టులో కూలిపోవడానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వివరణాత్మకంగా వెల్లడించింది. ఈ ఘోర ప్రమాదానికి ముందు ఆ ప్రాంతంలో పొగమంచు కారణంగా రన్‌వే కనిపించడం లేదని సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియజేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.
బారామతి ఒక నియంత్రణ లేని ఎయిర్‌ఫీల్డ్ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

బారామతి ఏటీసీ పరిధిలోకి విమానం
ఇక్కడ ట్రాఫిక్ సమాచారాన్ని పూర్తి స్థాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ ద్వారా కాకుండా అక్కడ పనిచేస్తున్న ఫ్లయింగ్ శిక్షణ సంస్థల నుండి బోధకులు లేదా పైలట్లు అందిస్తారని తెలిపింది. ఎయిర్‌ఫీల్డ్‌లోని ఏటీసీ సౌకర్యాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి ఇచ్చిన ప్రకటన ఆధారంగా సంఘటనల క్రమాన్ని కేంద్రం తెలిపింది. పవార్ మరో నలుగురితో కలిసి ప్రయాణిస్తున్న విమానం VI-SSKగా గుర్తించారు. ఉదయం 8.18కి ఈ విమానం బారామతి ఏటీసీ పరిధిలోకి వచ్చింది. బారామతికి 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఈ విమానం నుంచి ఏటీసీకి రేడియో కాల్ వచ్చింది. ఆ దశలో పైలట్ అంచనా మేరకు విజిబులిటీని బట్టి కిందకు దిగాలని సూచించారు.
ఏటీసీతో పైలట్ల సంప్రదింపులు
దీంతో వెంటనే విమాన సిబ్బంది గాలులు, దృశ్యమానత గురించి ఏటీసీని అడిగారు. గాలులు ప్రశాంతంగా ఉన్నాయని, విజిబులిటీ దాదాపు 3 వేల మీటర్లు ఉందని ఏటీసీ చెప్పింది. అనంతరం సిబ్బంది విమానం రన్ వే 11 కోసం దగ్గరకు చేరుకున్నట్లు తెలిపారు. కానీ రన్ వే కనిపించడం లేదని చెప్పారు. తర్వాత వారు కిందకు దిగకుండా చుట్టూ తిరుగుతున్నారు. కాసేపటికి మళ్లీ రన్ వే 11 ను గుర్తించి దిగేందుకు ప్రయత్నాలు చేశారు. ఇదే క్రమంలో రన్ వే కనిపించిందని ఏటీసీకి చెప్పారు. ఉదయం 8.43 సమయంలో, విమానం రన్వే 11లో ల్యాండ్ కావడానికి అనుమతి ఇచ్చారు. అయితే సిబ్బంది ల్యాండింగ్ క్లియరెన్స్ రీడ్‌బ్యాక్‌ను ఇవ్వలేదు.

కుప్పకూలిన విమానం
ఒక నిమిషం తర్వాత, అంటే ఉదయం 8.44 గంటలకు, ఎయిర్‌ఫీల్డ్‌లోని సిబ్బంది రన్‌వే 11 ప్రవేశద్వారం దగ్గర మంటలను గమనించారు.క్రాష్ సైట్‌కు వెంటనే అత్యవసర సేవలను పంపించారు. తరువాత రన్‌వే యొక్క ఎడమ వైపున, రన్‌వే 11 ప్రవేశద్వారం దగ్గర శిథిలాలు గుర్తించారు. దీంతో విమానం రన్ పై దిగే ప్రయత్నంలో కుప్పకూలినట్లు గుర్తించినట్లు పౌరవిమానయానశాఖ తెలిపింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications