షాక్: మహిళకు హెచ్ఐవీ రక్తం ఎక్కించి ? 14 మంది పై కేసు
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మహిళకు నిర్లక్షంగా హెచ్ఐవీ సోకిన రక్తం ఎక్కించి ఆమె జీవితంతో చెలగాటం ఆడిన 14 మంది ఆసుపత్రి సిబ్బంది.
బెంగళూరు: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మహిళకు నిర్లక్షంగా హెచ్ఐవీ సోకిన రక్తం ఎక్కించి ఆమె జీవితంతో చెలగాటం ఆడిన 14 మంది ఆసుపత్రి సిబ్బందితో పాటు, ఇన్ చార్జ్ మీద బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
బెంగళూరు నగరంలోని సదాశివనగరలోని ప్రసిద్ధి చెందిన ఆసుపత్రిలో 2014లో ఓ మహిళ అనారోగ్యంతో అడ్మిట్ అయ్యింది. ఆ సమయంలో హెచ్ఐవీ సోకిన (హెచ్ఐవీ పాజిటివ్) వ్యక్తి రక్తం సేకరించిన ఆసుపత్రి సిబ్బంది రక్తపరీక్షలు చెయ్యకుండానే దానిని ఆ మహిళకు ఎక్కించారని ఆరోపణలు ఉన్నాయి.

బాధితురాలు బెంగళూరు 7వ ఏసీఎంఎం కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సదాశివనగర పోలీసులు ఐపీసీ 120 బి, 320, 336, 338 సెక్షన్ల కింద 14 మంది సిబ్బంది (ఆసుపత్రి) మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు.












Click it and Unblock the Notifications