మాజీ సీఎంను అవమానిస్తూ పోస్టర్లు, అధికార పార్టీ లీడర్స్ మీద ఎఫ్ఐఆర్, దెబ్బ కొడితే ?
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కించపరిచి వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు అతికించిన కొద్ది రోజుల తర్వాత శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో కేపీసీసీ నాయకుడి మీద ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. జేడీఎస్ నేతల ఫిర్యాదు మేరకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) కార్యదర్శి ఎస్. మనోహర్‌తో పాటు మరో నలుగురిపై బెంగళూరులోని శ్రీరాంపుర పోలీసులు కేసు నమోదు చేశారు.
నవంబర్ 20వ తేదీన బెంగళూరులోని రాజాజీనగర్, శేషాద్రిపురం తదితర ప్రాంతాల్లో మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామికి వ్యతిరేకంగా ముద్రించిన వివిధ పోస్టర్లు అతికించారు. మాజీ సీఎం, జేడీఎస్ లీడర్ కుమారస్వామిని కరెంట్ దొంగ అంటూ అవహేళన చేస్తూ జేడీఎస్ కార్యాలయాల కాంపౌండ్ కు కూడా పోస్టర్లు వేశారు. జేడీఎస్ నేతలు బుధవారం బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి.దయానంద్‌ను కలిసి కేపీసీసీ కార్యదర్శి మనోహర్ తో ఇతరుల మీద ఫిర్యాదు చేశారు.

జేడీఎస్ నేత రమేశ్ గౌడ ఫిర్యాదు మేరకు బెంగళూరులోని శ్రీరాంపుర పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకుల మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేపీసీసీ కార్యదర్శి ఎస్ మనోహర్, కార్తీక్ డి, దర్శన్ గౌడ, అర్జున్ గౌడ, సంతోష్ తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేశామని శ్రీరాంపుర పోలీసులు వెల్లడించారు. మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం మరియు భాష ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం సెక్షన్ ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు అంటున్నారు..
దీపావళి పండుగ సందర్భంగా మాజీ సీఎం కుమారస్వామి ఆయన జేపీ నగర్ నివాసానికి విద్యుత్ స్తంభం నుంచి కరెంటు లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ (బెస్కామ్) అధికారులు మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామికి రూ. 68,000 జరిమానా విధించింది. బెస్కాం అధికారులు విధించిన అపరాధ రుసుంను ఇప్పటికే మాజీ సీఎం కుమారస్వామి చెల్లించారు.

తనను కించపరిచి వేసిన పోస్టర్ల విషయంపై మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నీలి చిత్రాలను చూపించి గతంలో జీవనోపాధి పొందారని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. నీలి చిత్రాలను చూపుతూ జీవనం సాగించిన అలాంటి వ్యక్తికి మరేం తెలుస్తుంది, ఎలాంటి బుద్ది వస్తుంది అని మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నించారు.
కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ కు పాతబుద్దిపోలేదని, అతను అలాంటి పోస్టర్లు మాత్రమే వేయగలరని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. తన మీద వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంటానని ఇప్పటికే మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాలు విసిరారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications