• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఢిల్లీకి ఏమైంది?.. వరుస అగ్నిప్రమాదాలతో కలవరం

|

ఢిల్లీ : ఢిల్లీకి ఏమైంది? వరుస అగ్నిప్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? అధికారుల లోపమా? ప్రజల నిర్లక్ష్యమా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికినా.. బాధ్యులపై చర్యలు మాత్రం ఉండవు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజు వ్యవధిలోనే రెండు ఫైర్ యాక్సిడెంట్లు జరగడం చర్చానీయాంశమైంది. మంగళవారం నాడు నగరం నడిబొడ్డులోని హోటల్ లో మంటలు చెలరేగి 17 మంది చనిపోగా.. బుధవారం నాడు ఎగిసిపడ్డ అగ్నికీలలకు వందలాది గుడిసెలు బుగ్గిపాలయ్యాయి.

కాలిబూడిదైన గుడిసెలు..!

బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. పశ్చిమపురి ఏరియాలో 200 కు పైగా గుడిసెలు కాలి బూడిదయ్యాయి. ప్రాణనష్టం జరగనప్పటికీ చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. 26 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఓ గుడిసెలో సిలిండర్ పేలడం వల్లే మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. మరోవైపు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిఉండొచ్చనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నదంతా మంటల్లో కాలిపోయిందంటూ బాధితులు వాపోయారు.

17 మందిని పొట్టన పెట్టుకున్న హోటల్ ప్రమాదం

17 మందిని పొట్టన పెట్టుకున్న హోటల్ ప్రమాదం

మంగళవారం నాడు కరోల్ బాగ్ ఏరియాలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది చనిపోగా 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో ఒక మహిళ, ఓ చిన్నారి ఉన్నారు. హోటల్ అర్పిత్ ప్యాలెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్నవారు బయటకు పరుగులు పెట్టారు. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు ఫైర్ యాక్సిడెంట్ సంభవించడంతో మృతుల సంఖ్య ఎక్కువయింది. అందరూ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

నెలరోజుల వ్యవధిలో..!

నెలరోజుల వ్యవధిలో..!

ఢిల్లీలో ఇటీవల అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటం చర్చానీయాంశమైంది. సరిగ్గా నెలరోజు కిందట వెస్ట్ ఢిల్లీలో జరిగిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. కీర్తి నగర్ లోని ఫర్నీచర్ షాపులో చెలరేగిన మంటలు క్షణాల్లో దావానంలా వ్యాపించాయి. దీంతో ఎగిసిపడ్డ అగ్నికీలలు పక్కనే ఉన్న మురికివాడకు వ్యాపించాయి. పేదలు నివాసముండే గుడిసెలు, ఇళ్లు 100 వరకు కాలి బూడిదయ్యాయి. నెలరోజుల వ్యవధిలో రెండు భారీ అగ్నిప్రమాదాల కారణంగా భారీ సంఖ్యలో గుడిసెలు కాలిబూడిదయ్యాయి. పెద్దసంఖ్యలో నిరాశ్రయులయ్యారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
What's up to Delhi? Why are firefighters going on? Defective officers? People's neglect? If there are answers to such questions, there is no action on the responsible persons. Two fire accidents in the capital of Delhi have been discussed at a single day. A fire broke out at the hotel in the heart of the city on Tuesday, killing 17 people and hitting hundreds of huts on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more