వెదురుబొంగు స్టోర్‌లో అగ్నిప్రమాదం, మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

కోల్‌కతా : సూరత్ కోచింత్ సెంటర్‌లో అగ్నిప్రమాదం మరవకముందే బెంగాల్‌లో మరో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఆస్తినష్టమే జరిగినట్టు తెలుస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

పార్క్ సర్కస్ గోడౌన్‌లో మంటలు ..
కోల్ కతాలోని పార్క్ సర్కస్ గోడోన్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. ఇది రైఫిల్ రంగె రోడ్ స్టోర్ వద్ద ఉంది. మిట్ట మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌నకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు 15 ఫైరింజిన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఎగిసిపడుతున్న మంటలను క్రమంగా ఆర్పివేశాయి. ఆ స్టోర్‌లో వెదురుబొంగులు ఉండటం, ఫ్లైవుడ్ సంబంధించి వస్తువులు ఉండటంతో వేగంగా మంటలు వ్యాపించాయి.

Fire breaks out at Park Circus in Kolkata; 12 fire tenders at spot

ఆస్తినష్టమే ...
అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ జరగలేదని పోలీసులు తెలిపారు. మంటల్లో ఎవరూ చిక్కుకున్నట్టు తమకు సమాచారం అందలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి ఉందని వివరించారు. పార్క్ సర్కస్ లో జరిగిన ప్రమాదంతో రైల్వే రాకపోకలకు అంతరాయం కలుగదని పశ్చిమ రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ఘటన జరిగిన ప్రాంతం రైల్వే ట్రాక్ ల మధ్య చాలా దూరం ఉందని .. రైళ్లను నిలిపివేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+