Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రపంచ ప్రసిద్ది చెందిన మైసూరు ప్యాలెస్ లో అగ్నిప్రమాదం: ఎస్ బీఐ బ్యాంకు !

ప్రపంచ ప్రసిద్ది చెందిన మైసూరు ప్యాలెస్ ప్రవేశద్వారంలో శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. మైసూరు అంబావిలాస ప్యాలెస్ ప్రవేశ్వద్వారం దగ్గర ఉన టిక్కెట్ కౌంటర్ సమీపంలోని ఎస్ బీఐ బ్యాంక్ ఏటీఎం కే

మైసూరు: ప్రపంచ ప్రసిద్ది చెందిన మైసూరు ప్యాలెస్ ప్రవేశద్వారంలో శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. మైసూరు అంబావిలాస ప్యాలెస్ ప్రవేశ్వద్వారం దగ్గర ఉన టిక్కెట్ కౌంటర్ సమీపంలోని ఎస్ బీఐ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో నుంచి ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి.

విషయం తెలుసుకున్న మైసూరు ప్యాలెస్ సిబ్బంది వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గంట పాటు శ్రమించి మంటలు అదుపుచేశారు. ఎస్ బీఐ ఏటీఎం కౌంటర్ లోని బ్యాటరీ నుంచి మంటలు వ్యాపించాయని దేవరాజ్ పోలీస్ స్టేషన్ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

Fire took place in ticket counter of world famous Mysuru palace

విషయం తెలుసుకున్న ఏసీపీ శైలేంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంలో ఏటీఎం మిషన్ పూర్తిగా కాలిపోయిందని పోలీసులు అన్నారు. ఏటీఎం యంత్రంలో ఎంత మొత్తంలో నగదు ఉంది అని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ప్రపంచ ప్రసిద్ది చెందిన మైసూరు అంబావిలాస ప్యాలెస్ ప్రవేశ ద్వారం చాల పురాతనమైనది. ఈ అగ్నిప్రమాదంలో ఆ కట్టడం దెబ్బతినిందని దేవరాజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అక్కడి భద్రతా సిబ్బంది ఉన్న కట్టడానికి మంటలు వ్యాపించాయని పోలీసు అధికారులు తెలిపారు. మైసూరు ప్యాలెస్ దగ్గర అగ్నిప్రమాదం జరగడంతో ప్రజలు, ప్యాలెస్ సిబ్బంది ఆందోళనకు గురైనారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+