ఢిల్లీ కోర్టు వద్ద కాల్పుల కలకలం: ఒకరికి గాయాలు..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు వద్ద కాల్పుల కలకలం రేగింది. గేటు నం.2 వద్ద చోటు చేసుకున్న కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడ్డాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపినవారి వివరాలు, దాని వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాల్పుల కలకలంతో అటువైపు రాకపోకలు నిలిపివేశారు. కాగా, స్థానిక గ్యాంగ్‌స్టర్ల మధ్య వివాదమే కాల్పులకు కారణమన్న వాదన కూడా వినిపిస్తోంది.













Click it and Unblock the Notifications