బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Shoot: సావార్కర్, టిప్పు సుల్తాన్ ఎఫెక్ట్, పోలీసులపై ఎదురుదాడి, కాల్చిపారేసిన మామలు, దెబ్బకు సైలెంట్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/శివమొగ్గ: వీర సావార్కర్, టిప్పుసుల్తాన్ ఫోటోలు, ఫెక్సీల ఏర్పాటు చెయ్యడం వలన గొడవలు జరగడంతో ఇద్దరు యువకులను దారుణంగా పొడిచేశారు. కొంతమందికి గాయాలై ఆసుపత్రిపాలైనారు. యువకుడిని కత్తితో పొడిచి తప్పించుకుని పారిపోయిన నిందితుడిని పట్టుకోవడానికి వేకువ జామున వెళ్లిన పోలీసుల మీద దాడులు జరిగాయి. చివరికి పోలీసులు నిందితుడి మీద కాల్పులు జరిపి అరెస్టు చేశారు. మరో యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ గొడవల దెబ్బకు ఊరు మొత్తం దుకాణాలు మూసి వేయేడంతో బంద్ వాతావరణం నెలకొనింది. శివమొగ్గలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా స్కూల్స్, కాలేజ్ లు మూసివేసి సెలవులు ప్రకటించారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో అంటూ ఇరు వర్గాల ప్రజలు భయంతో హడలిపోతున్నారు.

Lady leader: స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో నల్లజెండాలతో హంగామా, రాసలీలల వీడియోతో !Lady leader: స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో నల్లజెండాలతో హంగామా, రాసలీలల వీడియోతో !

మాజీ సీఎం ఇలాకాలో !

మాజీ సీఎం ఇలాకాలో !

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సొంత ఊరుశివమోగ్గ నగరంలో వీర సావార్కర్, టిప్పుసుల్తాన్ ఫోటోలు, ఫెక్సీల కారణంగా గొడవలు మొదలైనాయి. టిప్పు సుల్తాన్ గొప్ప వ్యక్తి అంటూ కొందరు, వీర సావార్కర్ లు దేశభక్తుడు అంటూ కొందరు వాదనలకు దిగడంతో వివాదం పెద్దది అయ్యింది.

పరిస్థితి చెయ్యిదాటిపోయింది

పరిస్థితి చెయ్యిదాటిపోయింది

శివమొగ్గలో స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవాల ఊరేగింపు ఘనంగా జరిగింది. స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్బంగా ఓ వర్గం వారు వీర సావార్కర్ ఫోటోలు, ఫెక్సీలు, మరో వర్గం వాళ్లు టిప్పు సుల్తాన్ ఫోటోలు, పెక్సీలు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల వాళ్లు వేర్వేరు ఫోటోలతో ఫెక్సీలు ఏర్పాటు చేసి నినాదాలు చెయ్యడంతో పరిస్థితులు చెయ్యిదాటిపోయాయి.

కత్తులతో దాడులు

కత్తులతో దాడులు

వీర సావార్కర్, టిప్పుసుల్తాన్ ఫోటోలు, ఫెక్సీల కారణంగా గొడవలు జరగడంతో శివమొగ్గలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రేమ్ సింగ్ (20), ప్రవీణ్ అనే ఇద్దరు యువకుల మీద కత్తులతో దాడులు చేశారు. తీవ్రగాయాలైన ప్రేమ్ సింగ్, ప్రవీణ్ ను శివమొగ్గలోని మెగ్గాస్ ఆసుపత్రికి తరించారు. విషయం తెలుసుకున్న ఓ వర్గం వారు గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 రంగంలోకి అదనపు పోలీసు బలగాలు.... లాఠీచార్జ్

రంగంలోకి అదనపు పోలీసు బలగాలు.... లాఠీచార్జ్


ఈ గొడవల దెబ్బకు శివమొగ్గలోని అనేక ప్రాంతాల్లో దుకాణాలు మూసి వేయేడంతో బంద్ వాతావరణం నెలకొనింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శివమొగ్గలో వారం రోజుల పాటు నిషేధాజ్ఞలు విధించారు. ముందుజాగ్రత్త చర్యగా స్కూల్స్, కాలేజ్ లు మూసివేసి సెలవులు ప్రకటించారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో అంటూ శివమొగ్గలోని ఇరు వర్గాల ప్రజలు హడలిపోతున్నారు.

 ప్యాలెస్ సమీపంలో మకాం

ప్యాలెస్ సమీపంలో మకాం

బట్టల దుకాణంలో పని చేస్తున్న ప్రేమ్ సింగ్ ను మార్నమమిబైలు ప్రాంతంలో నివాసం ఉంటున్న చర్బీ అలియాస్ మోహమ్మద్ జబి (30) అనే యువకుడు కత్తితో పొడిచాడని పోలీసులకు సమాచారం అందింది. శివమొగ్గలోని ఎన్ టీ రోడ్డులోని ఫలక్ ప్యాలెస్ సమీపంలో జబి తలదాచుకున్నాడని పోలీసులకు సమాచారం అందింది.

కాల్చిపారేసిన పోలీసులు

కాల్చిపారేసిన పోలీసులు


మంగళవారం వేకువ జామున అరెస్టు చెయ్యడానికి వెళ్లిన శివమొగ్గ పోలీసుల మీద జబి ఎదురుదాడికి దిగాడు. ఆ సందర్బంలో శివమొగ్గలోని వినోభనగర ఎస్ఐ మంజునాథ్ కాల్పులు జరపడంతో రివాల్వర్ బుల్లెట్లు నిందితుడు జబి కాలిలోకి దూసుకుపోయాయి. బుల్లెట్ గాయాలైన జబిని శివమొగ్గలోని మెగ్గాస్ ఆసుపత్రికి తరలించారు. ఇదే సందర్బంలో మరో నిందితుడు అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్టు చేశామని శివమొగ్గ పోలీసు అధికారులు తెలిపారు.

English summary
firing: Man stabbed in Shivamogga in clash over Savarkar's poster. Police shoot accused leg on the August 16th morning and arrested
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X