వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ రాకెట్ నిందితుడితో నరేంద్ర మోడీ ఫోటో ! (ఫోటో)

|
Google Oneindia TeluguNews

పాట్నా: జర్నలిస్టు హత్య కేసులో ప్రధాన నిందితుడైన షార్ప్ షూటర్ మహమ్మద్ ఖైఫీతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ దిగిన ఫోటో బీహార్ లో దూమరం రేపింది.

తేజ్ ప్రతాప్ యాదవ్, షార్ప్ షూటర్ మహమ్మద్ ఖైఫీ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జైలు నుంచి విడుదలైన ఆర్జేడీ మాజీ ఎంపీ షాహబుద్దీన్ ముఖ్య అనుచరుడు మహమ్మద్ ఖైఫీ.

పాత్రికేయుడైన రాజ్ దేవ్ రంజన్ హత్య కేసులో మహమ్మద్ ఖైఫీ ప్రధాన నిందితుడు. అలాంటి నిందితుడితో బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఫోటో దిగడం, ఆ ఫోటో బయటకురావడంతో నితీశ్ సర్కారును ఇరకాటంలో పెట్టింది.

First ask Narendra Modi to resign: Tej Pratap hits back

వెంటనే తేజ్ ప్రతాప్ యాదవ్ తన మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరో వైపు ఆర్జేడీ మాజీ ఎంపీ షాహబుద్దీన్ విడుదల విషయంలో ప్రతిపక్షాలు నితీశ్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి.

తన మీద విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ మీద లాలూ ప్రసాద్ యాదవ్ తనయడు తేజ్ ప్రతాప్ యాదవ్ విమర్శలు గుప్తిస్తున్నారు. సెక్స్ రాకెట్ నిందితుడు అయిన టీనూ జైన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో దిగారని పేర్కొంటూ ఓ ఫోటో విడుదల చేశారు.

మహమ్మద్ ఖైఫీతో ఫోటో దిగానని తనను రాజీనామా చెయ్యాలని అడుగుతున్న బీజేపీ మొదట ప్రధాని నరేంద్ర మోడీతో రాజీనామా చేయించాలని తేజ్ ప్రతాప్ యాదవ్ తన ఫేస్ బుక్ లో డిమాండ్ చేశారు.

తాను ఓ రాజకీయ నాయకుడని, తనతో చాల మంది ఫోటోలు దిగుతారని, అందరితో తనకు సంబంధం ఉందంటే ఎలా ? అని లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీని ప్రశ్నిస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ, సెక్స్ రాకెట్ నిందితుడు టీనూ జైన్ దిగిన ఫోటో విషయంపై బీజేపీ స్పందించాల్సి ఉంది.

English summary
Bihar Health minister Tej Pratap Yadav has released pictures of Prime Minister Narendra Modi alongside a man accused of running sex racket as he hits back at calls for him to step down over photos of him with an alleged sharpshooter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X