First Bullet Train : బుల్లెట్ ట్రైన్ పై బిగ్ అప్డేట్స్..! 15-20 నిమిషాలకో రైలు-ఛార్జీలివే..!
భారత్ లో వచ్చే ఏడాది తొలి బుల్లెట్ రైలు(First Bullet Train)ను ప్రారంభించేందుకు రంగం సిద్దం చేస్తున్న రైల్వేశాఖ.. ఇవాళ మరిన్ని వివరాలు వెల్లడించింది. ఇప్పటికే వచ్చే ఏడాది ఆగస్టు 15న తొలి బుల్లెట్ రైలు ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. ఇవాళ ఈ రైలు ఎన్ని ట్రిప్ లు వేయబోతోంది, ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయన్న వివరాల్ని కూడా వెల్లడించారు. రద్దీ సమయాల్లో బుల్లెట్ రైలు ప్రయాణాలపైనా క్లారిటీ ఇచ్చారు.
ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (MAHSR) కారిడార్‌లో ప్రారంభ దశలో 15 నుండి 20 నిమిషాల వ్యవధిలో బుల్లెట్ రైలు సేవలను నడపాలని భావిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రద్దీ సమయాల్లో బుల్లెట్ రైలు ప్రారంభంలో ప్రతి 15-20 నిమిషాలకు నడుస్తుందని రైల్వే మంత్రి వెల్లడించారు. తరువాత ఫ్రీక్వెన్సీని పెంచుతామని, రద్దీ సమయాల్లో ప్రతి 10 నిమిషాలకు రైళ్లు నడుస్తాయని, ప్రయాణీకుల డిమాండ్‌ను బట్టి మార్పులు ఉంటాయన్నారు.

బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ భారత ఆర్థిక వ్యవస్థపై బలమైన ప్రభావం చూపబోతోందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండు గంటల కంటే తగ్గుతుందని ఆయన తెలిపారు. మీరు ఉదయం అల్పాహారం తర్వాత సూరత్ నుండి బుల్లెట్ రైలు ఎక్కి, పని కోసం ముంబైకి ప్రయాణించి, సాయంత్రం సూరత్‌కు తిరిగి రావచ్చన్నారు. అలాగే ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఏర్పడిన ఉపాధి ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దాదాపు లక్ష మంది ప్రయోజనం పొందారని కూడా రైల్వే మంత్రి తెలిపారు.

అలాగే బుల్లెట్ రైలు టికెట్ ధరపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ఛార్జీలు మధ్యతరగతికి అందుబాటులో ఉంటాయని మంత్రి క్లారిటీ ఇచ్చారు. అంటే ప్రస్తుతం ఉన్న ప్రీమియం రైళ్ల తరహాలోనే ఉండొచ్చనే సంకేతాలు ఇచ్చారు. ఇవాళ మొట్టమొదటి బుల్లెట్ రైలు కారిడార్ మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక పర్వత సొరంగంలో నిర్మాణం పూర్తి చేసుకుందది. ఈ కారిడార్ లో మొత్తం ఎనిమిది పర్వత సొరంగాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉండగా.. ఇందులో ఏడు మహారాష్ట్రలో, ఒకటి గుజరాత్‌లో ఉన్నాయి.












Click it and Unblock the Notifications