తొలిసారి ఎంపీ ఆయిన చౌదరికి 'సన్సద్ రత్న 2015 అవార్డు'
న్యూఢిల్లీ: బీజేపీ నేత, రాజస్ధాన్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన పీపీ చౌదరి 'సన్సద్ రత్న 2015 అవార్డు'కు ఎంపికయ్యారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో చివరి వరకు ఆయన పనితీరుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
'ఈ అవార్డుకు ఎంపికైన నలుగురు లోక్‌సభ సభ్యుల్లో చౌదరి ఒకరు. 16వ లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లో వీరు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు' అని ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఛైర్మన్ కె. శ్రీనివాసన్ తెలిపారు.
2009లో ప్రారంభమైన ఈ ఫౌండేషన్ ఒక ఎన్జీవో. పార్లమెంట్‌లో సభ్యులు పాల్గొనే చర్చల సంఖ్య, ప్రశ్నల సంఖ్య, సభ్యుడు ప్రవేశపెట్టిన బిల్లులతో పాటు బడ్జెట్ సమావేశాలకు చివరి వరకు హాజరయ్యాడా అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

ఓపెన్ కేటగిరిలో మూడు విభాగాల్లో (పాల్గొనే చర్చల సంఖ్య, ప్రశ్నల సంఖ్య, సభ్యుడు ప్రవేశపెట్టిన బిల్లులు)ను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ముగ్గురికి ఈ అవార్డుకి ఎంపిక చేస్తారు. పీఆఎర్ఎస్ లేజిస్టేటివ్ రీసెర్చ్, లోక్‌సభ సెక్రటేరియట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేసినట్లు శ్రీనివాసన్ తెలిపారు.
పీపీ చౌదరి రెండు అవార్డులను గెలుచుకున్నట్లు శ్రీనివాసన్ తెలిపారు. 176 చర్చల్లో పాల్గొందుకు ఒకటి లభించగా, మరొకటి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన సందర్భంగా ఎంపిక చేశామని పేర్కొన్నారు. 384 పాయింట్లతో లోక్‌సభ సభ్యుల్లో మొదటి స్ధానంలో నిలిచారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..?












Click it and Unblock the Notifications