లక్ అంటే ఇతడితే, లోన్ డిఫాల్టర్ నోటీస్ వచ్చిన వెంటనే రూ.70 లక్షల లాటరీ, ఎక్కడంటే..?
అప్పుడప్పుడు లక్ అలా కలిసి వస్తోంది. ఎవరికైనా.. ఇందులో తరతమ భేదాలేం లేవు. అయితే లోన్ తీసుకుంటే తిప్పలు తప్పవు. ముక్కుపిండీ మరీ వసూల్ చేస్తారు. అలా ఓ చేపల వ్యాపారికి అలాంటి పరిస్థితి ఎదురయ్యింది. బ్యాంక్ డిఫాల్టర్ నోటీసు కూడా పంపించింది. ఇంకేముంది.. ఓరీ భగవంతుడా అనుకునే లోపు.. అతనికి తలపై పాలుపోసినట్టయ్యింది. అవును.. అతనికి లాటరీ తగిలింది. అదీ కూడా రూ.70 లక్షలు కావడంతో మనసులోనే ఎగిరి గంతేశాడు.
పూకుంజు అనే వ్యాపారికి బ్యాంక్ నుంచి నోటీసు వచ్చింది. లోన్ కట్టకపోవడంతో డిఫాల్టర్ జాబితాలో చేర్చింది. కానీ ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అక్షయ లాటరీ వరించింది. ఫస్ట్ ప్రైజ్ రూ.70 లక్షల నగదును గెలుచుకున్నాడు. చేపలు విక్రయించేందుకు వెళ్లగా.. లాటరీ గురించి తెలిసింది. అయితే మద్యాహ్నమే ఇంటికి బ్యాంకర్లు నోటీసు ఇచ్చారు. రూ.9 లక్షల లోన్ కట్టాలని స్పష్టంచేశారు. లేదంటే ఇంటిని జప్తు చేస్తామని పేర్కొన్నారు.

బ్యాంక్ నోటీసు రావడంతో వారు ఆందోళన చెందారు. ఇంటికి అమ్మేయాలా అని ఆలోచించారు. కానీ వారికి లాటరీ రావడంతో ఆనందానికి అవధి లేకుండా పోయింది. అప్పుల్లో కూరుకుపోయిన ఆ కుటుంబం లక్షాధికారి అయ్యింది. తొలుత తమ అప్పులను తీర్చుకుంటామని.. తర్వాత పిల్లలకు మంచి చదువు చెప్పిస్తామని తెలిపింది. దీంతో వారు జీవితంలో ఉన్నత స్థానంలోకి చేరుకుంటారని పేర్కొన్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications