Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

North-East Express: పట్టాలు తప్పిన నార్త్-ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు: ఐదుగురు మృతి, హాహాకారాలు

పాట్నా: బీహార్ రాష్ట్రంలో బుధవారం రాత్రి రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బీహార్‌లోని బక్సర్ జిల్లాలోని రఘునాథ్ స్టేషన్ సమీపంలో బుధవారం కామాఖ్య వెళ్లే నార్త్-ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు భారతీయ రైల్వే అధికారి మీడియాకు తెలిపారు.

రైల్వే అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 9.35 గంటలకు బక్సర్ సమీపంలోని రఘునాథ్‌పూర్ స్టేషన్‌కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా, అసోంలోని గౌహతి సమీపంలోని కామాఖ్యకు సూపర్‌ఫాస్ట్ రైలు వెళ్తోంది.
'ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి కామాఖ్యకు వెళ్తున్న రైలు నంబర్ 12506 నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని కోచ్‌లు బుధవారం 21.35 గంటలకు దానాపూర్ డివిజన్‌లోని రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి' అని రైల్వే అధికారి వెల్లడించారు.

Five Bogies Of North-East Express Derail In Buxar, Bihar

రైలు ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో కాపాడాలంటూ కేకలు వేశారు. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఎమర్జెన్సీ కాంటాక్ట్ కోసం ఉత్తర రైల్వే హెల్ప్‌లైన్‌ను షేర్ చేసింది. హెల్ప్‌లైన్ నంబర్ PNBE: 9771449971, DNR: 8905697493, ARA: 8306182542, COML CNL: 7759070004.

క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని, సంబంధిత అధికారులను వీలైనంత త్వరగా ఘటనాస్థలికి పంపాలని విపత్తు నిర్వహణ, ఆరోగ్య శాఖ, బక్సర్‌, అర్రా జిల్లా అధికారులను ఆదేశించినట్లు బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ తెలిపారు. ఇదిలా ఉండగా, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం డిప్యూటీ జనరల్‌తో పాటు ఇతర అధికారులతో పాటు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి అశ్విని చౌబే తెలిపారు.

'నేను మా కార్మికులకు విజ్ఞప్తి చేశాను, వారు రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నారు. వైద్య బృందాలను పంపించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. నేను బక్సర్‌లోని రఘునాథ్‌పూర్‌కి కూడా వెళ్తున్నాను' అని చౌబే తెలిపారు. కాగా, ఇటీవల ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రయాణిలు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కొందరు రైల్వే ట్రాక్‌లపై భారీ బండరాళ్లను పెట్టి ప్రమాదాలు జరిగేందుకు కారణమవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ వారంలో రెండు వెలుగుచూడటం గమనార్హం. లోకోపైలట్ల అప్రమత్తతో ఈ ప్రమాదాలు తప్పాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+