మేఘాలయలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 21 మంది ఎమ్మెల్యేల నుంచి జీరోకు పడిపోయిన హస్తం..

మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తమ పార్టీకి మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు హస్తానికి హ్యాండిచ్చారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో కాంగెస్ పార్టీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలుపొందగా.. నేడు ఒక్కరు కూడా మిగలేదు.. అందరూ ప్రత్యర్థుల పార్టీలో చేరిపోయాయి.

గత ఏడాది నవంబర్‌లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు. తాజాగా ఆపార్టీలో మిగిలిన ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి ఉద్వాసన పలికారు. బీజేపీ భాగస్వామిగా ఉన్న అధికార మేఘాలయ డెమోక్రటిక్ అలయెన్స్‌లో చేరారు. ఈమేరకు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మాను కలిశారు. తామంతా కూటమిగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు లేఖను సీఎంకు సమర్పించారు. వీరి కూటమికి సీఎం కాన్రాడ్ కె. సంగ్మా సాదరస్వాగతం పలికారు.

Five Congress MLAs Join Meghalaya Democoratic alliance

ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, ప్రభుత్వ విధానాల పటిష్టతకు ఎండీఏ ప్రభుత్వంతో తామంతా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ఐదుగురు ఎమ్మెల్యేలు వెల్లడించారు. అందరం కలిసికట్టుగా పనిచేయడం ద్వారా రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుకెళ్లేందుకు దొహదం చేస్తుందని తెలిపారు.

ఈ మేరకు ఐదుగురు ఎమ్మెల్యే సంతకాలు చేసిన మెమొరాండంను సీఎంకు సమర్పించారు. త్రిపుర, నాగాలాండ్ లతో పాటు మేఘాలయలో 2023 ఫిబ్రవరిల ఎన్నికలు జరగాల్సింది ఉంది. 2018లో 21 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు జీరోకి పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో హస్తానికి వచ్చే ఎన్నికల్లో మరింత గడ్డు పరిస్థితి తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+