మహిళపై గ్యాంగ్ రేప్: ఐదుగురికి పదేళ్ల జైలు శిక్ష

మహిళపై సామూహిక అత్యాచారం కేసులో బారిపడ అదనపు జిల్లా న్యాయమూర్తి సుదిప్త కుమార్ ఆచార్య మంగళవారం ఐదుగురిని దోషులుగా నిర్ధారించిం, వారికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఐదు వేల రూపాయలేసి జరిమానా విధించారు.
జరిమానా చెల్లించని పక్షంలో దోషులు అదనంగా మూడు నెలలేసి జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 2013 జనవరి 19వ తేదీన గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త వద్దకు వెళ్తూ లఘు శంక తీర్చుకోవడానికి పక్కన ఉన్న ప్రవాహం వైపు వెళ్లినప్పుడు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది.
గిరిజన మహిళపై అత్యాచారం కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. అయితే, నిందితుల్లో ఒకతను జైలులో మరణించాడు.












Click it and Unblock the Notifications