తమిళనాడులో రోడ్డు ప్రమాదం, కారు నుజ్జునుజ్జు: బెంగళూరుకు చెందిన ఐదు మంది!

Posted By:
Subscribe to Oneindia Telugu

హోసూరు/బెంగళూరు: తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో హోసూరు సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ఐదు మంది దుర్మరణం చెందారు. వేగంగా వెలుతున్న కారు కేఎస్ఆర్ టీసీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

బెంగళూరుకు చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు మంగళవారం వేకువ జామున కారులో క్రిష్ణగిరి వైపు బయలుదేరారు. మార్గం మధ్యలో క్రిష్ణగిరి-హోసూరు రహదారిలోని కామనదోడ్డి ప్రాంతంలో కేఎస్ఆర్ టీసీ బస్సును కారు ఢీకొనింది.

Five persons were killed in a car crash on the Krishnagiri-Hosur national highway.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదు మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. కారు నుజ్జునుజ్జు కావడంతో ఐదు మంది మృతదేహాలు అందులో చిక్కుకున్నాయి. హోసూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో మృతదేహాలను హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు సేకరిస్తున్నామని హోసూరు పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Five people, including two women, died when a car collided with KSRTC bus in Tamil Nadu's Krishnagiri district on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి