వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైవ్‌స్టార్ రేటింగ్‌లు.. రివ్యులు వేటికనుకుంటున్నారు...ఆన్‌లైన్ పిడకలకు...!

|
Google Oneindia TeluguNews

పేడ ,దాన్నినుండి వచ్చే పిడకలు , వీటి పేరు వింటేనే చాలమంది నగర పౌరులకు ఇది ఒక అంటరాని వస్తువు, సాంప్రదాయకంగా గ్రామాల్లో పేడ నీళ్లతో తెల్లవారుజామునే ఇంటిముందు నేలపై కళ్లాపు చల్లి ముంగిళిని అందంగా తీర్చుదిద్దుతారు గ్రామీణ మహిళలు. కాని పట్టణీకరణ పెరుగుతుండడంతో దాని అవసరం అటు గ్రామీణ వ్యవస్థల్లోను అటు పట్టణ వ్వవస్థల్లోను కనిపించడం లేదు. . అందులో ఓ పశువు నుండి వచ్చిన వ్యర్థ పదార్థం కావడంతో ఇప్పటి మహిళలకు, పురుషులకు కూడ దాని వాసన పడదు. చీ.. పేడ అంటూ దూరం వెళ్లే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఇదోక పనికి రాని వస్తువులాగా ట్రీట్ చేస్తారు.

ఆన్‌లైన్ పిడకలకు మంచి గిరాకీ

ఆన్‌లైన్ పిడకలకు మంచి గిరాకీ

కాని అదే పేడతో చేసిన పిడకలకు ,దాన్ని నుండే వచ్చే వాసనకు మాత్రం ఆన్‌లైన్‌లో మంచి గిరాకి ఉంది. వాటి డిమాండ్ మీద ప్రజలు ఆన్‌లైన్ పోర్టల్స్‌లో చర్చించుకుంటున్నారు. పిడకలు ఆన్‌లైన్ స్టోర్స్‌లలో ఇంతకు దొరుకుతున్నాయి. ఇతర ఆన్‌లైన్ స్టోర్లలో తక్కువ ధరలు ఉన్నాయంటూ రివ్యూలు పెడుతున్నారు. పిడకలను ఫ్లిప్ కార్డ్‌లో రూ 599లకు లభిస్తుండగా ,అమేజాన్‌లో మాత్రం 649 రుపాయలకు లభిస్తున్నాయి. దీంతో పిడకలపై రివ్యులు రాస్తున్నారు నెటిజన్లు..

నవ్వు తెప్పిస్తున్న పిడకలకు ఫైవ్ స్టార్ రేటింగ్‌లు ,రివ్యూలు,

నవ్వు తెప్పిస్తున్న పిడకలకు ఫైవ్ స్టార్ రేటింగ్‌లు ,రివ్యూలు,

దూరం కోట్టే పేడకు రివ్యూలు రేటింగ్‌లు చర్చలు అంటే ఎంతైన నవ్వురాక తప్పదు. అసలు మనకు పనికి రాదు భావించే మెజారిటి ప్రజలు అభిప్రాయ పడుతుంటే దాని డిమాండ్ పై చర్చలు పెట్టడం నవ్వించే విషయమే మరి. ఈ నేపథ్యంలోనే కొంతమంది రివ్యులు ఎలా ఉన్నాయంటే ''ఇవి చాల బాగున్నాయి '' వీటీ వాసన బాగుంది ,"ఇది గులాబి వాసనను పోలీ ఉంది". "అక్కడ కొనకండి వాటి రేటు ఎక్కువగా ఉంది, ''250 కే 24 పిడకలు ఇచ్చారు", "ఫ్లిప్‌కార్ట్ లో 14 పిడకలకు 600 " వీటిని బట్టి పిడకలకు ఏలాంటీ డిమాండ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

పిడకలు దేనికి వాడతున్నారు,ఎందుకింత డిమాండ్...

పిడకలు దేనికి వాడతున్నారు,ఎందుకింత డిమాండ్...

సాధరణంగా హిందు సంప్రదాయం ప్రకారం ఏదైన హోమాలు చేసినా, శుభకార్యాలు చేసిన పిడకలను ఉపయోగిస్తారు. మరియు ఆవు పాలకు గాని పేడకుగా మరి ఇబ్బంది పడే పరిస్థితి ఇతర ప్రాంతాలతోపాటు దేశాల్లో స్థిరపడ్డ హిందువులకు వాటిని తెచ్చుకోవడం ఇబ్బందే ,దీనికి తోడు పిడకలు గ్రామీణ ప్రాంతాల్లో తప్ప ఎక్కడ పట్టణ ప్రాంతాల్లో లభించని పరిస్ధితి. దీంతో ఆన్‌లైన్ సంస్థలు వాటిని సోమ్ము చేసుకుంటున్నాయి.

రివ్యులపై ఆన్‌లైన్ వ్యాపారం ఆధారం...

రివ్యులపై ఆన్‌లైన్ వ్యాపారం ఆధారం...

ఇప్పుడంతా ఆన్‌లైన్ ఎదీ కావాలన్న కార్పోరేట్ కంపనీలు మన ఇళ్లముందుకు తెచ్చిఇస్తున్నాయి. దీంతో ప్రపంచంలో దొరకని వస్తువంటూ ఏదీలేదు. ఏక్కడ ఏమూలన మనకు కావల్సిన వస్తువున్న ఆమేజాన్ ,ఫ్లిప్‌కార్డులతో పాటు ఇంకా వందలాదీ ఆన్‌లైన్ సంస్థలు వినియోగదారులకు అందిస్తున్నాయి..మరి ఎక్కడో తాయారైన వస్తువును అందిస్తున్న సంస్థకు దాని పని తీరును అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానిపై రివ్యూలు ఉంటాయి.. రివ్యులను బట్టే ఏవస్తువుకైన డిమాండ్ ఉంటుంది.అయితే కొన్ని వస్తువుల పై రివ్యూలు చూస్తే మనకు నవ్వు వస్తుంది.

English summary
Flipkart is selling pure cow dung cakes on its website for just Rs 599.Yes you read it right. Cow dung for Rs 600. Actually, pure cow dung or upla for hawan and Indian rituals. It is the latest item to hit the e-commerce websites and we don’t know what to say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X