చొరబాటుకు యత్నం: ఐదుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర దాడిని భద్రతాసిబ్బంది తిప్పికొట్టారు. సరిహద్దు దాటి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులపై కాల్పులు జరిపి వారిని హతమార్చారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్వారా జిల్లాలోని తాంగ్‌ధార్ సెక్టార్ ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి దేశంలో చొరబడేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతాసిబ్బంది వారిని అడ్డుకునేందుకు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని, ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా కాల్పులు జరపొద్దని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ పాకిస్థాన్ మాత్రం కాల్పులు జరుపుతూనే ఉంది.












Click it and Unblock the Notifications