US Visa: అమెరికా వీసా కావాలా ? కొత్తగా ఈ ఐదేళ్ల కండిషన్..!
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక వలసదారులతో పాటు భారతీయ విద్యార్ధులపైనా కొరడా ఝళిపిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే అమెరికా వీసాలు కోరుకునే భారత్ తో పాటు ఇతర దేశాల విద్యార్ధులకు ముప్పుతిప్పలు పెడుతూనే ఉన్నారు. అమెరికాలో చోటు చేసుకుంటున్న ఘటనల్ని సాకుగా చూపుతూ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తెస్తున్న ట్రంప్ సర్కార్ వాటిని పాటిస్తేనే వీసా ఇస్తామని తేల్చిచెప్పేస్తోంది.
ఇందులో భాగంగా తాజాగా భారత్ నుంచి వీసా కోరుకునే విద్యార్ధులకు సైతం సోషల్ మీడియాలో గత ఐదేళ్ల చరిత్రను బయటపెట్టాల్సిందేనని తేల్చిచెప్పేసింది. ఈ మేరకు భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకూ వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల సోషల్ మీడియా చరిత్రను పరిశీలించేవారు. దీంతో సదరు విద్యార్ధులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే సోషల్ మీడియాలో పోస్టుల్ని డిలీట్ కొట్టేస్తున్నారు.

ఈ నేపథ్యంలో గత ఐదేళ్ల సోషల్ మీడియా చరిత్రను తమకు అందిస్తేనే వీసా దరఖాస్తుల్ని ప్రాసెస్ చేస్తామని అమెరికా వారికి తేల్చిచెప్పేసింది. అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఉన్న గత ఐదేళ్ల డేటాను బయటపెట్టాల్సిందేనని అమెరికా ఎంబసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్టు పెట్టింది. ఇందులో వీసా దరఖాస్తుదారులు గత 5 సంవత్సరాలుగా వారు ఉపయోగించిన ప్రతి ప్లాట్‌ఫామ్ యొక్క అన్ని సోషల్ మీడియా యూజర్‌నేమ్‌లు లేదా హ్యాండిల్స్‌ను DS-160 వీసా దరఖాస్తు ఫారమ్‌లో జాబితా చేయాలని కోరింది.
Visa applicants are required to list all social media usernames or handles of every platform they have used from the last 5 years on the DS-160 visa application form. Applicants certify that the information in their visa application is true and correct before they sign and… pic.twitter.com/ZiSewKYNbt
— U.S. Embassy India (@USAndIndia) June 26, 2025
దరఖాస్తుదారులు సంతకం చేసి సమర్పించే ముందు వారి వీసా దరఖాస్తులోని సమాచారం నిజమని, సరైనదని ధృవీకరించాలని తెలిపింది. అలాగే వీసా దరఖాస్తుల్లో సోషల్ మీడియా సమాచారాన్ని ఇవ్వకుండా దాచి పెడితే వీసా తిరస్కరణకు, భవిష్యత్తులో వీసాలకు అనర్హతకు దారితీయవచ్చని కూడా హెచ్చరించింది.












Click it and Unblock the Notifications