హమ్మయ్యా.. ముంబై చేరుకున్న 219 మంది భారతీయులు
ఉక్రెయిన్‌లో బిక్కుబిక్కు మన్న భారతీయులు కాసేపటి క్రితం మాతృభూమికి చేరుకున్నారు. 219 మందితో రొమానియా నుంచి బయల్దేరిన విమానం ముంబై రీచ్ అయ్యింది. ఉక్రెయిన్ గగనతలంపై నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ నుంచి వారంతా రొమానియా కాలి నడకన/ వాహనాల్లో చేరుకున్న సంగతి తెలిసిందే.
ముంబై వచ్చిన వారికి మేయర్ కిశోర్ పండెకర్ స్వాగతం పలికారు. వారంతా తమ పిల్లలు అని చెప్పారు. వారు ఎక్కడికి వెళ్లేందుకు అయినా ఓకే అని.. కానీ పరీక్ష చేయడం, వ్యాక్సినేషన్, ఆహారం ఇతర అన్నీ ఖర్చులను తామే భరిస్తామని తెలిపారు. భారత్ చేరుకున్న వారందరికీ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఘన స్వాగతం పలికారు.

రొమెనియా నుంచి భారత్ తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్వయంగా మానిటర్ చేశారు. వారిని తీసుకొచ్చేందుకు నిరంతరం శ్రమించామని.. తెలిపారు. తమను సంప్రదించకుండా దాటొద్దు అని అధికారులు స్పష్టంచేశారు. ఆ మేరకు సమన్వయం చేసుకుని ముందడుగు వేశారు.
ఇటు ఉక్రెయిన్‌లో భారత విద్యార్థుల కష్టాలు వర్ణణాతీతం. దేశం విడిచి వెళ్లే మార్గం తెలియక ఆందోళన చెందుతున్నారు. నిన్న 40 మంది భారత విద్యార్థుల బృందం 8 కిలోమీటర్లు నడిచి పోలెండ్ సరిహద్దు వద్దకు చేరుకున్నారు. వారందరూ ల్వీవ్ నగరంలోని ఓ మెడికల్ వర్సిటీలో మెడిసన్ చేస్తున్నారు. ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో స్వదేశం చేరడానికి ఇబ్బందులు తప్పడం లేదు. భారత విద్యార్థులను వర్సిటీకి చెందిన ఓ బస్సు 70 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చింది. పోలెండ్ సరిహద్దుకు 8 కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టింది. ఆపై వారందరూ సరిహద్దు వద్దకు కాలినడకన చేరుకున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలైన ల్వీవ్, చెర్న్ విట్సిలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసింది. పోలెండ్ వెళ్లాలనుకునే భారత విద్యార్థులకు సహకరించేందుకు రష్యన్ భాష మాట్లాడే అధికారులను అక్కడ నియమించింది.












Click it and Unblock the Notifications