పురిటి నొప్పులు: దుబాయ్ విమానం చెన్నైలో ల్యాండింగ్
చెన్నయ్: విమానంలో ప్రయాణిస్తున్న మహిళకు పురిటి నొప్పులు రావడంతో విమానాన్ని అత్యవసరంగా కిందకు దించివేశారు. ఆ సమయంలో సాటి ప్రయాణికులు పురిటి నొప్పులు వస్తున్న మహిళకు ఏమి కాదని ధైర్యం చెప్పి మానవత్వం చాటుకున్నారు.
బుధవారం దుబాయ్ నుండి ప్రయివేటు విమానం ఇండోనేషియా బయలుదేరింది. ఆ విమానంలో మొత్తం 300 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇదే విమానంలో నిండు గర్బవతి ప్రయాణిస్తున్నారు. అయితే ఆ మహిళకు పురిటి నొప్పులు ఎక్కవ అయ్యాయి.

విషయం తెలుసుకున్న పైలెట్ ఎయిర్ పోర్టు అధికారులను సంప్రదించారు. విమానం చెన్నయ్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చెయ్యడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. వెంటనే విమానం చెన్నయ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది.
అప్పటికే అక్కడ మహిళ వైద్యులతో పాటు ఆంబులెన్స్ సిద్దంగా ఉంది. వెంటనే మహిళను చెన్నయ్ లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. తరువాత విమానం చెన్నయ్ నుండి బయలుదేరి వెళ్లింది. మహిళను గురువారం వేరే విమానంలో పంపిస్తామని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications