రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి అంత్యక్రియలు
ముంబై: దుబాయ్‌లో మృతి చెందిన ప్రముఖ నటి శ్రీదేవి భౌతికకాయంతో దుబాయ్ నుంచి ప్రత్యేక విమానం భారత్ బయలు దేరింది. ఈ రోజు రాత్రి పది గంటలకల్లా అది ముంబై చేరుకోనున్నట్టు సమాచారం.
శ్రీదేవి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ముంబైలోని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో రేపు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి పవన్ హన్స్ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది.

మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లే హిందూ శ్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో ముంబైలోని శ్రీదేవి నివాసం వద్దకు ఆమె అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. శ్రీదేవి కుమార్తెలు జాహ్నవి, ఖుషి కపూర్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు ప్రస్తుతం నటుడు అనిల్ కపూర్ నివాసం వద్ద వేచి ఉన్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications