శుభవార్త: మొబైల్స్ పై భారీ డిస్కౌంట్లను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం సందర్భంగా మొబైల్స్‌పై ప్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును ప్రకటించింది. జనవరి 3 నుంచి జనవరి 5 మధ్యలో ఈ సేల్ నిర్వహిస్తుంది. పలు కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఫ్లిప్ కార్ట్ ఈ ఆఫర్లను ప్రకటించింది. షావోమి ఎంఐ ఏ1, గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్, మోటో జీ5 ప్లస్, రెడ్‌మి నోట్4, లెనోవో కే5 నోట్, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

స్వల్ప ఛార్జీతో బై బ్యాక్ గ్యారెంటీ, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడ ప్రకటించింది.షావోమి ఎంఐ ఏ1 ఫోన్‌ను రూ.12,999లకే విక్రయించనున్నట్టు ప్రకటించింది.
గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్‌నురూ.39,999కే విక్రయించనున్నట్టు ప్రకటించింది.
అయితే హెచ్ డి ఎఫ్ సి క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలతో మరో రూ8 వేల డిస్కౌంట్ అందుబాటులోకి రానుందిరెడ్‌మీ నోట్ 4 స్మార్ట్ పోన్ రూ.10999కే లెనెవో కే5 నోట్ ను రూ.11,482 విక్రయించనున్నట్టు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications