బంపర్ ఆఫర్: రూ.39,999లకే గూగుల్ పిక్సెల్, ఐఫోన్ పై ప్లిప్‌కార్ట్ ఆఫర్లివే

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రెండు రోజుల పాటు భారీ డిస్కౌంట్స్‌ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్స్‌ను డిసెంబర్ 7వ,తేది మధ్యాహ్నం నుండి ప్రారంభించింది.మొబైల్స్, టాబ్లెట్స్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది. అంతేకాదు ఎక్సేంజ్ సౌకర్యాన్ని కూడ కల్పించింది.

ఈ కామర్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్ తన ప్రత్యర్థికి పోటీగా నిలిచేందుకు రెండు రోజుల పాటు బిగ్ సేల్స్‌ను తీసుకువచ్చింది. మొబైల్స్, టాబ్లెట్స్‌తో పాటు పలు ఆఫర్లను ప్రకటించింది.

రెండు రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కొన్ని మొబైల్ ఫోన్లపై సగానికి సగం తగ్గింపును ప్రకటిస్తూ ఫ్లిప్‌కార్ట్ నిర్ణయం తీసుకొంది. అంతేకాదు ఎస్‌బిఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు చేసిన వారికి అదనంగా డిస్కౌంట్లను ప్రకటిస్తూ ఫ్లిప్‌కార్ట్ నిర్ణయం తీసుకొంది.

ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్లను ఇస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 7వ, తేది మధ్యాహ్నం నుండి రెండు రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది.. ఈ సేల్‌లో భాగంగా అన్ని కేటగిరీల్లోని బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ సేల్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఆపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌, గూగుల్‌ పిక్సెల్‌ 2 మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

శుభవార్త: ఐ ఫోన్ ఎస్ఈ 32 జీబీ రూ.17,999, అమెజాన్ బంపర్ ఆఫర్

ఐఫోన్ ఎక్స్ ఫ్లిప్‌కార్ట్‌లోనే సేల్స్

ఐఫోన్ ఎక్స్ ఫ్లిప్‌కార్ట్‌లోనే సేల్స్

ఐఫోన్‌ ఎక్స్‌ లిమిటెడ్‌ స్టాక్‌ సేల్‌తో ఫ్లిప్‌కార్ట్‌ నేటి మధ్యాహ్నం నుంచి లైవ్‌లోకి వచ్చింది. రూ.89వేల వద్ద సేల్‌ ప్రారంభమవుతుంది. ఎస్‌బీఐ డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.5000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్లను అందిస్తుంది. ఐఫోన్‌ ఎక్స్‌ ఫోన్‌పై నో-కాస్ట్‌ ఈఎంఐను కూడా తీసుకొచ్చింది. అతిపెద్ద సెల్లింగ్‌ కేటగిరీగా ఉంటున్న మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కంపెనీ ఎక్కువగా ఫోకస్‌ చేసింది.

గూగుల్ పిక్సెల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్

గూగుల్ పిక్సెల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్

గూగుల్‌ పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేసింది ఫ్లిప్‌కార్ట్. గూగుల్‌ పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.39,999కు అందజేస్తోంది. అయితే దీని అసలు ధర రూ. 61 వేలు. ఇంచుమించుగా సగం ధరకే ఈ ఫోన్‌ను గూగుల్ అందిస్తోంది.

ఇతర మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్లు

ఇతర మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్లు


శాంసంగ్‌ ఆన్‌ నెక్ట్స్‌, మోటో సీ ప్లస్‌, లెనోవో కే8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్‌ తీసుకొస్తుంది. ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లు కూడా భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తుంది. సోనీ, జేబీఎల్‌ బ్రాండ్లపై 70 శాతం తగ్గింపును అందిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు చేస్తే తక్షణమే 10 శాతం డిస్కౌంట్‌ను ఇస్తుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Flipkart’s three-day Big Shopping Days sale has begun today. Under this, the e-commerce portal is offering discounts, exchange offers and cash back schemes on several products, including mobiles & tablets,

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి