Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ షురూ.. 24 వరకు భారీ డిస్కౌంట్లు, ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు

ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ నిన్నటి నుంచి ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ (ఎఫ్ఈఎస్)ను ప్రారంభించింది.

ముంబై: ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ (ఎఫ్ఈఎస్)ను ప్రారంభించింది. నిన్నటి నుంచి మార్చి 24 వరకు మూడు రోజులపాటు ఈ ఎక్స్ క్లూజివ్ 3-డే ఈవెంట్ నిర్వహించనుంది.

ఈ సేల్ లో భాగంగా మొబైల్స్ టెలివిజన్స్, ల్యాప్ టాప్స్, ఎయిర్ కండీషనర్స్, ఎలక్ట్రానిక్ యాక్ససరీస్, స్మార్ట్ గ్యడ్జెట్స్ పై ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. రూ.5,999 కనీస మొత్తంలో ఫ్లిప్ కార్ట్ పై కొనుగోలు చేసిన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు తక్షణమే 10 శాతం డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ కల్పిస్తోంది. ఈ తక్షణ డిస్కౌంట్ ఆఫర్ ఈవెంట్ ముగిసే వరకు ఉంటుంది.

Flipkart Electronic Sale: All the best deals

ఐఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు...

ప్రస్తుతం నడుస్తున్న ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ లో ఐఫోన్ 7 అన్ని వేరియంట్ల కొనుగోలుపై 20 శాతం డిస్కౌంట్, ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కింద రూ.13500 ధర తగ్గింపును ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది.

ఐఫోన్ 6ఎస్ 32 జీబీ వేరియంట్ ధరపై కూడా రూ.7000 వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్న ఈ సంస్థ ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కూడా ఇదే మొత్తంలో ఉంటుందని పేర్కొంది. ఐఫోన్ 6 16జీబీ వేరియంట్ ధరను రూ.10,500 తగ్గించేసింది. ఇంకా ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ద్వారా అదనపు డిస్కౌంట్ అందిస్తోంది.

గూగుల్ పిక్సెల్, మోటో జెడ్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్లపై...

ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ కింద ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లో గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ పై రూ.20 వేల వరకు, గూగుల్ పిక్సెల్ ఎక్స్ ఎల్ పై రూ.13,500 వరకు ధర తగ్గించింది. ఇక మోటో జెడ్, మోటో జెడ్ ప్లే మోడల్స్ పై ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కింద రూన.13,500 డిస్కౌంట్ కల్పిస్తోంది.

శాంసంగ్ సీ9ప్రో, హానర్ 8, హ్యువాయ్ పీ9, సోనీ ఎక్స్ పేరియా ఎక్స్ ఏ అల్ట్రా వంటి స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ ధరలను తగ్గించి, డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఆపిల్ ఐప్యాడ్, లెనెవో యోగా 3, లెనెవో ఫ్యాబ్ 2 ప్రొ ఫాబ్లెట్, ఆపిల్ వాచ్, ఆసుస్ జెన్ వాచ్ 3 వంటి వాటిపై కూడా బోలెడు డిస్కౌంట్లను ప్రకటించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+