వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. వరద ప్రవాహాం.. బైక్‌తో కొట్టుకుపోయిన వ్యక్తి (వీడియో)

|
Google Oneindia TeluguNews

వర్షాలతో వరద ప్రవాహాం కొనసాగుతోంది. ఇళ్లలోకి నీరు రావడమే కాదు.. రహదారులపై కూడా వచ్చి చేరింది. సో ఇలాంటి సమయంలో ప్రయాణిస్తోన్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా బైక్ మీద జర్నీ చేసే సమయంలో ప్రాబ్లమ్ తప్పదు. కర్ణాటకలో ఓ వ్యక్తి అలానే వరద ప్రవాహాంలో కొట్టుకుపోయారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

భారీ వర్షాల వల్ల ఆ రోడ్డు ఒక నదిలా తయారైంది. వేగంగా ప్రవహిస్తున్న నీటిలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ కొందరు ఆ రోడ్డు దాటుతున్నారు. మరికొందరు తమ బైకులపై రోడ్డు దాటాలని ప్రయత్నించారు. అలా చేస్తుండగా ఒక వ్యక్తి తన బండితో సహా కింద పడిపోయాడు. నీటి ప్రవాహ వేగాన్ని అడ్డుకోలేక బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తూ కాసేపటికే రోడ్డుకు ఆవలివైపుకు చేరుకున్నాడు.

Floodwaters sweep away biker in karnataka Tumakuru

కర్ణాటకలోని తుమకూరు రోడ్డుపై ఈ ఘటన జరిగింది. అక్కడ ఉన్న కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అతనే కాకుండా మరో బైకర్‌ కూడా ఇలాగే కింద పడిపోగా.. చుట్టుపక్కల వారు అతన్ని కాపాడారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల భారీగా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఆ వర్షంతో జన జీవనం స్తంభించిన సంగతి తెలిసిందే.

Recommended Video

Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి. గత వారం రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతిలో ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, వరదల వల్ల తిరుమల కొండచరియలు విరిగి ఘాట్‌ రోడ్డుపై పడిపోయాయి. మెట్టుమార్గంలో చెట్లు, వరద నీటితో అస్థవ్యస్థంగా తయారైంది. తిరుమల కొండలపైనుంచి వస్తున్న వాన నీటితో కపిలతీర్ధంలో మండపం కూలిపోయింది. తిరుమల జలదిగ్బందంలో చిక్కుకొనిపోయింది. ఇలా పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ జోరు వానలు జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరో రెండు, మూడు రోజులు కూడా వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది.

English summary
man on his bike swept away in floodwaters in Tumakuru, Karnataka. Due to incessant rain in Karanataka, roads in districts of the state were waterlogged
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X