సీక్రెట్ కాదు, ఓపెన్ బ్యాలెట్టే: తేల్చేసిన సుప్రీం, బీజేపీ వాదనపై నవ్వేసిన ధర్మాసనం
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప ప్రభుత్వంపై బలనిరూపణ విషయంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పులను వెల్లడించింది. శనివారం సాయంత్రం 4గంటల లోగా యడ్యూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొవాల్సిందేనని ఆదేశించింది.
బీజేపీ తరపు న్యాయవాది రోహిత్గి సమయం కావాలని కోరినప్పటికీ సుప్రీం అందుకు అంగీకరించలేదు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వెళ్లారని.. వారు వచ్చేందుకు సమయం పడుతుందని, అందుకే మరికొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు రోహిత్గి.

అయితే, దీనికి సుప్రీంకోర్టు ధర్మాసనం నవ్వేసింది. అయినా, బలనిరూపణకు సమయం పెంచబోమని స్పష్టం చేసింది. శనివారం సాయంత్రం 4గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బలపరీక్ష జరగాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఆ తర్వాత న్యాయవాది ముకుల్ రోహిత్గి కోర్టుకు మరో విన్నపం తెలియజేశారు. బలనిరూపణ పరీక్షను సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని కోరారు. ఇందుకు కూడా కోర్టు అంగీకరించలేదు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా బలపరీక్ష నిర్వహించకూడదని, ఓపెన్ ఓట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో బీజేపీ శనివారం బలపరీక్షకు సిద్ధమవుతోంది.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications