గుజరాత్‌లో తొలి జాబితాతో మోడీకి షాక్: బీజేపీకి వరుస రిజైన్లు, ఆదివాసీ బిగ్ ఝలక్
గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 70 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల రెండు రోజుల క్రితం విడుదల చేసింది. రాజ్‌కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి గుజరాత్ సీఎం విజయ్ రుపానీ పోటీ చేయనున్నారు.
అహ్మదాబాద్: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 70 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల రెండు రోజుల క్రితం విడుదల చేసింది. రాజ్‌కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి గుజరాత్ సీఎం విజయ్ రుపానీ పోటీ చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఇతర బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొన్న సమావేశంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేశారు.
Recommended Video


తొలి జాబితాతో బీజేపీలో ముసలం
తొలి జాబితా విడుదల కాగానే బీజేపీలో ముసలం ప్రారంభమైంది. ఇప్పటికే యువ నాయకుల మద్దతుతో కాంగ్రెస్ కొంత దూకుడు మీద ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టిక్కెట్ల విషయంలో అసంతృప్తులు బయటపడ్డాయి. అభ్యర్థుల ఎంపిక అందరి ఆమోదంతో జరిగిందని చెప్పినప్పటికీ అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేస్తున్నారు కొందరు.

సోదరుడికి టిక్కెట్, బీజేపీకి గుడ్ బై
భరూచ్ జిల్లా పంచాయతీ సభ్యుడు విజయ్ సింహ్ పటేల్ బీజేపీకి రాజీనామా చేశారు. అంకళేశ్వర్ శాసన సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఈశ్వర్ సింహ్ పటేల్‌ను ఎంపిక చేయడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే వీరిద్దరూ సోదరులే.

తనకు టిక్కెట్ రాకపోవడంతో పార్టీని వదిలేశారు
కొడినార్ ఎమ్మెల్యే జీతా సోలంకి బీజేపీకి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు టిక్కెట్ నిరాకరించడంతో ఆయన పార్టీకి దూరం జరిగారు.

కాంగ్రెస్ వైపు బీజేపీ నేత చూపులు
మహువా సీటును మళ్లీ రాఘవ్ జీ భాయ్ మక్వానాకే ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. దీంతో కౌన్సెలర్ బిపిన్ సంఘ్వీ కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. జస్థాన్ నియోజకవర్గంలో గజేంద్ర రమణి పార్టీ నుంచి వైదొలిగారు. భరత్ బోగ్రాను రంగంలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో రమణి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు.

స్వతంత్రంగా పోటీ చేసేందుకు బీజేపీకి గుడ్ బై
వడోదర జిల్లాలో కమలేష్ పర్మార్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పాడ్రా నియోజకవర్గం నుంచి స్వతంత్రంగా పోటీ చేసేందుకు ఆయన ఉద్యుక్తులవుతున్నారు. బీజేపీ ఇక్కడి నుంచి దినేష్ పటేల్‌ను రంగంలోకి దింపుతోంది.

బీజేపీకి ఆదివాసీ ఏక్తా మంచ్ షాక్
దక్షిణ గుజరాత్‌లో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడి పది నియోజకవర్గాల్లో ఆదివాసీ ఏకతా మంచ్‌కు పట్టు ఉంది. ఇప్పటి వరకు బీజేపీకి దీని మద్దతు ఉంది. బీజేపీ తొలి జాబితాలో తమకు గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పది నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెడతామని హెచ్చరించింది. గుజరాత్‌లో ఆదివాసీల ఓట్లు బీజేపీకే ఎక్కువగా పడతాయి. కానీ ఆదివాసీ మంచ్ పోటీలో నిలబెడితే ఇబ్బందులు తలెత్తనున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications