Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూఎస్ కంటే వేగంగా కోలుకున్న భారత్-యూపీఏ కంటే మెరుగ్గా ఆర్ధిక నిర్వహణ-నిర్మలా సీతారామన్

కేంద్ర బడ్డెట్ పై లోక్ సభలో జరుగుతున్న చర్చకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ సమాధానం ఇచ్చారు. ఇందులో ఆమె పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. కరోనా అనంతర పరిస్ధితుల్లో భారత ఆర్ధిక వ్యవస్ధ పనితీరు, గతంలో యూపీఏ హయాంలో ఆర్ధిక నిర్వహణతో పాటు పలు అంశాల్ని తన ప్రసంగంలో నిర్మల గుర్తుచేశారు.

లోక్‌సభలో బడ్జెట్ చర్చకు సమాధానం ఇస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూపీఏ హయాన్ని భారత దేశం యొక్క చీకటి కాలంగా అభివర్ణించారు. రెండంకెల ద్రవ్యోల్బణం, ఎఫ్‌డిఐల పేలవమైన నిర్వహణ, విపరీతమైన అవినీతి వంటివి యూపీఏ కాలాన్ని అంధకారంగా మార్చాయని ఆర్థిక మంత్రి విమర్శించారు. 2008 ఆర్థిక సంక్షోభంలో, తగ్గిన లాభాల పరంగా భారత జీడీపీ 2.21 లక్షల కోట్ల మేర దెబ్బతిందని ఆర్ధికమంత్రి తెలిపారు. ఇటీవలి కరోనా సంక్షోభంలో, భారత జీడీపీ 9.57 లక్షల కోట్లను కోల్పోయిందన్నారు. సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడినా.. 2020-21లో ద్రవ్యోల్బణం 6.2 శాతంగా ఉందన్నారు. . 2008-09లో ఇది 9.1 శాతంగా ఉందని గుర్తుచేశారు. అంటే జీడీపీలో సంకోచం, జిడిపికి చాలా పెద్ద నష్టం ఉన్నప్పటికీ, 2008లో భారతదేశం చిన్న సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు కంటే తాము ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచగలిగామన్నారు.

fm nirmala sitharamans reply on budget in LS, says indian economy recovering faster than US

కరోనాతో భారీ సంక్షోభం ఏర్పడినా కరెంట్ ఖాతాను మిగులులో ఉంచగలిగామని ఆర్ధిక మంత్రి తెలిపారు. అయితే 2008లో - చాలా చిన్న సంక్షోభ సమయంలో - భారత ఆర్థిక వ్యవస్థ కరెంట్ ఖాతా లోటులో ఉందని యూపీఏ హయాంను ఆమె గుర్తుచేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని నిర్మల తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 9 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయగా, అమెరికా వృద్ధిరేటు 4 శాతానికి చేరుకుంటుందని అంచనా ఉందన్నారు. 2021 జనవరి-మార్చి త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగిత రేటు మహమ్మారి మొదటి వేవ్ సమయంలో 20.8 శాతానికి చేరుకున్న తర్వాత 9 శాతానికి తగ్గిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. భారతదేశంలో ఆదాయ అసమానతపై ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఎన్డీయే ప్రభుత్వ పథకాలైన జన్ ధన్ యోజన, ప్రధాన మంత్రి ముద్రా యోజనలను ప్రస్తావించారు. ఆర్థిక చేరిక లక్ష్యాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+