సంచలనం: దాణా కుంభకోణం కేసులో లాలూను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు

Subscribe to Oneindia Telugu

రాంచీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యదవ్‌ను రాంచీ సీబీఐ కోర్టు శనివారం దోషిగా తేలుస్తూ తుది తీర్పు వెలువరించింది.  లాలూప్రసాద్‌ యాదవ్‌తో పాటు 15 మందిని దోషులుగా ప్రకటించింది.

మాజీ సీఎం జగన్నాథ్‌మిశ్రా సహా ఏడుగురిని నిర్ధోషులుగా తేల్చింది. వచ్చే జనవరి 3న శిక్ష ఖరారు చేయనుంది. తీర్పు నేపథ్యంలో లాలూను రాంచీ జైలుకు తరలించారు. కాగా, ఈ తీర్పుపై తాము న్యాయ పోరాటం చేస్తామని, న్యాయం కోసం హైకోర్టుకు వెళ్తామని ఆర్జేడీ తెలిపింది.

తీర్పు తర్వాత లాలూ స్పందన

దాణా కుంభకోణం కేసులో సీబీఐ వెలువరిచిన సంచలన తీర్పుపై లాలూ ప్రసాద్‌ యాదవ్‌ స్పందించారు. తనను దోషిగా తేల్చడంపై లాలూ బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ డర్టీ గేమ్‌ ఆడుతుందంటూ ధ్వజమెత్తారు. కోర్టు తీర్పు ఏకపక్షంగా ఉందని.. న్యాయకోసం తమ పోరాటం కొనసాగిస్తామంటూ చెప్పారు.

చివరికి న్యాయమే గెలుస్తుందంటూ చెప్పుకొచ్చారు. నిజం చెప్పులేసుకునే లోపే.. అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటూ ఆరోపించారు. కోర్టు తీర్పు ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమే అంటూ లాలూ ప్రసాద్‌ పార్టీ ఆర్జేడీ కూడా మండిపడుతోంది. సాక్ష్యాలను తారుమారు చేశారని, ఈ కేసులో న్యాయం కోసం హైకోర్టుకు వెళ్తామంటూ పేర్కొంది.

Lalu

తీర్పుకు ముందు లాలూ ఇలా..

తనకు మన న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. దాన‌ కుంభకోణంలో తీర్పు ఎలా ఉన్నా.. బీహార్ ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదని అన్నారు. రాంచీ కోర్టు శనివారం దాన‌(గడ్డి) కుంభకోణంపై తుదీ తీర్పు ఇవ్వనుంది.

సీబీఐ కోర్టు ముందు హాజరయ్యేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'పార్టీ గురించి నేనిప్పుడు బాధపడాల్సిందేమి లేదు.. అక్కడ తేజస్వీ ఉన్నాడు. అయినా మాకు అన్యాయం జరగదు. బీజేపీ కుట్రలను న్యాయం విడిచిపెట్టదు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అదే సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా మేం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం' అని అన్నారు.

Fodder scam verdict: Lalu Prasad arrives at CBI court, hopes for '2G-like' acquittal

కాగా, బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో 1990 నుంచి 1997 వరకు పశుసంవర్థకశాఖలో పశు దానాకు సంబంధించి రూ.900 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి.

పశుదాన కుంభకోణం కేసుకు సంబంధించి అక్టోబర్ 3, 2013లో సీబీఐ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోవడంతోపాటు పదకొండేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడయ్యారు. 2జీ కుంభకోణంలో ప్రధాన నిందితులతోపాటు అందరూ నిర్దోషులుగా తేలిన నేపథ్యంలో లాలూ దాన కుంభకోణంపై ఆసక్తి నెలకొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Read in English: Fodder scam verdict today
English summary
RJD chief Lalu Prasad Yadav accompanied by his younger son Tejashwi Prasad has reached the special CBI court in Ranchi which will pronounce verdict in a fodder scam case.The verdict which was earlier expected around 10.30 am has been postponed to 3pm.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి