పుట్ ఓవర్ బ్రిడ్జికూలి నదిలో పడిన 50 మంది, 12 మందిని రక్షించిన సిబ్బంది

Posted By:
Subscribe to Oneindia Telugu

పనాజీ: దక్షిణ గోవాలో పుట్ ఒవర్ బ్రిడ్జి కూలిన ఘటనలో 50 మంది నదిలో పడి గల్లంతయ్యారు.అయితే ఈ ఘటనలో 12 మందిని సురక్షితంగా రక్షించారు సహయకసిబ్బంది. నదిలో గల్లంతైన వారి కోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

వంతెనపైన పుట్ ఓవర్ బ్రిడ్జి ఉంది.అయితే పుట్ ఓవర్ బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ బ్రిడ్జి పై ఉన్నవారంతా కిందనే ఉన్నవారు నదిలో పడిపోయారు. నదిలో పడిన 50 మందిలో సుమారు 12 మందిని రక్షించారు రెస్క్యూటీమ్.దక్షిణ గోవాలోని కర్ చోరం ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. స్థానిక నదిపై పోర్చుగీస్ కాలంలో నిర్మించిన జువారి పాదచారుల వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

ఈ బ్రిడ్జికుప్పకూలుతున్న సమయంలో బ్రిడ్జిపై నడుస్తున్న 50 మంది నదిలో పడి గల్లంతయ్యారు.అయితే ఈ సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలానికి చేరుకొని నదిలో పడిపోయినవారిని రక్షించేందుకు సహాయక చర్యలను చేపట్టారు. అయితే ఇప్పటికే 12 మందిని రక్షించారు.అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

footover bridge

ఓ బాలుడు బ్రిడ్జిపై నుండి నదిలోకి దూకాడు. ఇది తెలుసుకొన్న పోలీసులు వంతెనవద్దకు చేరుకొని బాలుడిని రక్షించారు. ఈ క్రమంలోనే పాదచారులు వెళ్ళే ప్రదేశం జనాలు గుమికూడారు. బాలుడిని రక్షించిన తర్వాత కొందరు వెళ్ళిపోగా మరికొందరు అక్కడే ఉన్నారు. దీంతో వంతెన కుప్పకూలిపోయింది. దరిమిలా 50 మందికిపైగా పాదచారులు నదిలో పడి గల్లంతయ్యారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Footover bridge collapsed in south Goa on Thursday .50 members fell down in river, 12 members rescued.
Please Wait while comments are loading...