దేశ చరిత్రలో తొలిసారి: నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా తొలి మహిళా లాయర్ ఇందూ మల్హోత్రా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: హైకోర్టు జడ్జిగా సేవలు అందించకుండా నేరుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎన్నికైన మొదటి మహిళగా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రా రికార్డ్ సృష్టిస్తున్నారు. ఆమెతో పాటు ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్‌ను కూడా సుప్రీం కోర్టు జడ్జిగా కొలీజియం ఎంపిక చేసింది.

ఇందు మల్హోత్ర, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ పేర్లను కేంద్రానికి సిఫార్సు చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకొంది. ఇందులో ఇందు మల్హోత్ర నిమామకం దేశ చరిత్రలో ప్రాధాన్యత సంతరించుకోనుంది. న్యాయవాదులను తొలుత హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడం ఆనవాయితీగా ఆమె పేరును మాత్రం నేరుగా సుప్రీం న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయడం విశేషం.

indu malhotra

ఇలాంటి నియామకం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కానుంది. మధ్యవర్తిత్వ వ్యవహారాల్లో(ఆర్బిట్రేషన్‌) నిపుణురాలైన ఇందు 2007లో సీనియర్‌ న్యాయవాది హోదాను పొందారు. ఇటువంటి హోదాను పొందిన రెండో మహిళగా నిలిచారు. అంతకుముందు మూడు దశాబ్దాల క్రితం జస్టిస్‌ లీలా సేథ్‌ ఆ హోదాను పొందిన తొలి మహిళ.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
For the first time probably in the history of India, four top judges of the Supreme Court will address a press conference. The press conference is slated to be held at 12.15 pm.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X