ట్రెక్కింగ్ యువతుల బట్టలూడదీసి!: బెంగుళూరు కీచకపర్వం మరవకముందే..

ఓవైపు బెంగుళూరు కీచకపర్వం ఇంకా వార్తల్లో నానుతుండగానే.. మహిళలపై జరిగిన మరో దారుణం వెలుగుచూసింది.

పూణే: దేశంలో మహిళలకు భద్రత కరువైందా?.. మొన్న బెంగుళూరు కీచక పర్వం. నేడు మరాఠా గడ్డ మీద మహిళలకు మరో ఘోర అవమానం. ప్రాంతమేదైనా మహిళలకు మాత్రం మృగాళ్ల నుంచి వేధింపులు తప్పట్లేదు.

ఓవైపు బెంగుళూరు కీచకపర్వం ఇంకా వార్తల్లో నానుతుండగానే.. మహిళలపై జరిగిన మరో దారుణం వెలుగుచూసింది. మోరల్ పోలిసింగ్ పేరిట బట్టలూడదీసి మరీ వారిని అవమానించారు. పూణేకు 50కి.మీ దూరంలోని లోనావాలా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ట్రెక్కింగ్ కోసం 12మంది యువతీ-యువకుల బృందం ఇసాపూర్ కోటకు వెళ్లారు. అక్కడి కోటపై వారు ట్రెక్కింగ్ కు సిద్దమవుతున్న సమయంలో శివాజీ భక్తులమని చెప్పుకుంటూ కొంతమంది యువకులు అక్కడికి వచ్చారు. తాము 'ఫోర్డ్ లవర్స్' గ్రూప్ కి చెందినవారమని చెప్పుకున్నారు.

Ford Lovers group harassed trekking women

వస్తూ.. వస్తూనే.. యువతులపై మాటల యుద్దానికి దిగారు. అబ్బాయిలతో తిరిగి భారత సంస్కృతిని పాడుచేస్తున్నారని ట్రెక్కింగ్ కోసం వచ్చిన యువతులను విమర్శించారు. అమ్మాయిల వెంట ఉన్న అబ్బాయిలను కూడా తరిమికొట్టారు. వారసత్వ సంపద అయిన కోటను నాశనం చేస్తున్నారని దూషించారు.

మోరల్ పోలిసింగ్ పేరిట బట్టలూడదీసి మరీ వారిని కొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ అకృత్యాలన్ని ఫోటోలు, వీడియోల రూపంలో మీడియాకు దొరకడంతో.. అసలు విషయం వెలుగుచూసింది. అయితే ఇంత జరుగుతున్నా.. పోలీసులు మాత్రం దీనిపై స్పందించకపోవడం విచారకరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+