పాకెట్ ఫ్రెండ్లీ ఫారిన్ ట్రిప్.. తక్కువ ధరకే ఈ దేశాల్లో పర్యటించొచ్చు.. వివరాలు ఇవే..

భారత్ లో అనేక చారిత్రక కట్టడాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, వింతలు, విశేషాలకు నెలవుగా ఉంది. భారత్ ను సందర్శించేందుకు విదేశాల నుంచి నిత్యం అనేకమంది వస్తుంటారు. ఇటీవలి కాలంలో భారత్ ను సందర్శించే విదేశీయుల సంఖ్య పెరిగింది. అలాగే భారత్ నుంచి విదేశాలకు ఫారిన్ ట్రిప్ లు చేసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అయితే తక్కువ ధరకే మీరు కూడా ఫారిన్ ట్రిప్ వేయాలని అనుకుంటున్నారా..? మన దేశానికి దగ్గరలోనే ఉన్న టూరిస్ట్ ప్రాంతాల్ని ఎంచక్కా చూసి రావచ్చు. తక్కువ బడ్జెట్ లోనే అంటే కేవలం రూ. 20 వేల నుంచి రూ. 30 వేల బడ్జెట్ లోనే ఈ ఫారిన్ ట్రిప్ ను కంప్లీట్ చేయొచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఫారిన్ టూర్ అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రాంతం థాయిలాండ్. చాలా మందికి డ్రీమ్ టూరిస్ట్ స్పాట్​స్ లో థాయిలాండ్ లోని బ్యాంకాక్ తప్పకుండా ఉంటుంది. ఈ ఫారిన్ టూర్​ లో సరదాగా ఎంజాయ్ చేస్తూ చిల్ అవ్వాలని పెద్దలు, పిల్లలతో పాటు యువత కూడా కోరుకుంటారు. కానీ బడ్జెట్​ మొదలు పలు కారణాలతో ఇది అందరికీ సాధ్యం కాదు. కానీ ఇప్పుడు తక్కువ బడ్జెట్ లోనే ఇక్కడికి వెళ్లి రావచ్చు. ముంబై నుంచి తక్కువ ధరకే అంటే రూ. 18 వేల నుంచే బ్యాంకాక్ కు విమాన సదుపాయం ఉంది. అలాగే ఇటీవల ఏపీలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ బ్యాంకాక్ కు ఎయిర్ ఎక్స్ ప్రెస్ సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. థాయిలాండ్ లో బ్యాంకాక్ తోపాటు చియాంగ్ మాయి, పాయ్ ప్రాంతాల్లో పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ కూడా ఉంటుంది.

foreigntrip Pocket-friendly best You can visit these countries at a low cost here are the details

ఇక ప్రశాంతతకు మారుపేరు శ్రీలంక అని చెబుతారు. ముఖ్యంగా వచ్చే అక్టోబర్ లో ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ముంబై నుంచి కొలంబో రౌండ్ ట్రిప్ టికెట్ ధరలు తక్కువ లోనే అంటే రూ. 23 వేల నుంచే ప్రారంభం అవుతున్నాయి. అలాగే 30 రోజులు.. అంతకంటే తక్కువ కాలం ఉండే భారతీయులకు ఉచిత ఎంట్రీ ఉంటుంది. శ్రీలంక అనేక టూరిస్ట్ ప్రాంతాలు, దీవులు ఉన్నాయి. అక్కడి బీచ్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. కొలంబో, కాండీ, నువారా ఎలియా, సిగిరియా, గాలే, యాలా నేషనల్ పార్క్ తదితర పర్యటక ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి. మీరూ ఓ సారి ఈ దేశాల్లో ట్రిప్ ప్లాన్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+